AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్లు, ఫస్ట్ మూవీతో నేషనల్ క్రష్.. ఈ హాట్ బ్యూటీ ఎవరో తెల్సా

తొలి సినిమాతోనే నేషనల్ క్రష్‌గా మారిన బాలీవుడ్ నటి. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాల్లో నటించింది. కానీ కెరీర్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అలాగే ఈ చిన్నది ఒక చిత్రంలో 30 కిస్సింగ్ సీన్స్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెల్సా

Actress: ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్లు, ఫస్ట్ మూవీతో నేషనల్ క్రష్.. ఈ హాట్ బ్యూటీ ఎవరో తెల్సా
Actress
Ravi Kiran
|

Updated on: Dec 31, 2024 | 12:35 PM

Share

ఈ చిన్నది బాలీవుడ్ సినిమాతో అరంగేట్రం చేసింది. 2008లో ‘జన్నత్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు సోనాల్ చౌహాన్. సోనాల్ మొదటి చిత్రం నుంచి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో చేసినా.. ఈ బ్యూటీకి రావల్సినంత క్రేజ్ రాలేదు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో నటించి ఈ చిన్నది కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.

సోనాల్ చౌహాన్ తొలి సినిమా..

1987 మే 16న నోయిడాలో సోనాల్ చౌహాన్ జన్మించింది. సోనాల్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత, సోనాల్ ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టైటిల్‌ గెలుచుకున్న తొలి ఇండియన్‌గా సోనాల్ నిలిచింది. హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ఆప్కా సురూర్‌లోని ‘సంఝో నా’ పాటలో సోనాల్ మొదటిసారి కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీతో కలిసి జన్నత్(2008) చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. సోనాల్‌కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏం రాలేదు.

ఒక్క సినిమాలోనే 30 కిస్ సీన్స్..

2013లో, ‘3G- ఎ కిల్లర్ కనెక్షన్’ అనే చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఇందులో నీల్ నితిన్ ముఖేష్‌ హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ రికార్డు బ్రేకింగ్‌గా ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ చిత్రం మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్స్ ఉండగా.. ఆ రికార్డును3G సినిమా(30 కిస్ సీన్స్) బ్రేక్ చేసింది.

టాలీవుడ్ చిత్రాల్లోనూ..

సోనాల్ చౌహాన్ హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆమె మొదటి తెలుగు చిత్రం రెయిన్‌బో(2008). ఆ తర్వాత నాగార్జున, ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక సోనాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?