- Telugu News Photo Gallery Cinema photos Anil Ravipudi is promoting the film Sankranthiki Vasthunnam at no cost to the producer
Anil Ravipudi: బిన్నంగా సినిమా ప్రమోషన్.. నిర్మాతకు ఖర్చు తగ్గించిన అనిల్..
ఈ రోజుల్లో సినిమాలు చేయడం చాలా ఈజీయేమో గానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడమే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందులో ఆరితేరిన వాళ్లే కలెక్షన్ల వేటలో ముందుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు అనిల్ రావిపూడి. ఖర్చు లేకుండా నిర్మాతకు ప్రమోషన్ చేసి పెడుతున్నారీయన. అదెలాగో తెలుసా..?
Updated on: Dec 31, 2024 | 1:10 PM

రీల్స్‌లో కొన్ని రోజులుగా ఈ పాట తప్ప మరోటి వినిపించట్లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత రమణ గోగుల గొంతు విప్పినా.. ఎక్కడ విన్నా తన పాటే వినిపించేలా పాడారాయన. ఈ ఒక్క పాటతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది చాలదన్నట్లు అనిల్ రావిపూడి తన చిలిపి ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు.

చూస్తున్నారుగా.. ఇవన్నీ అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ అన్నమాట. సంక్రాంతికి వెంకీకి పోటీగా బాలయ్య, రామ్ చరణ్ సినిమాలు వస్తున్నాయి. ఇదే ప్రమోషన్‌గా వాడుకున్నారీయన.

వచ్చింది చరణ్ ఫ్యాన్సా.. బాలయ్య ఫ్యాన్సా అంటూ తనపై తనే సెటైర్లు వేసుకున్నారు. నిర్మాతలు రూపాయి ఖర్చు కాకుండా సెట్ నుంచే ప్రమోషన్ కానిచ్చేస్తున్నారు ఈ క్రేజీ కెప్టెన్ అనిల్ రావిపూడి.

సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తోనే ఆలోచనలో పడేసిన అనిల్.. ఇప్పుడదే టైటిల్‌తో కావాల్సినంత ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజానికి పండగ సినిమాలు మూడు పోటీ పడి మరీ ప్రమోట్ చేసుకుంటున్నారు.

బడ్జెట్ పరంగా అయినా.. బిజినెస్ పరంగా అయినా.. సేఫ్ జోన్‌లో ఉన్నది అనిల్ రావిపూడి సినిమానే. మొత్తానికి ఈయన దూకుడు మామూలుగా లేదిప్పుడు. అలాగే వెంకీ, అనిల్ కాంబోలో గత రెండు సినిమాలు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.




