- Telugu News Photo Gallery Cinema photos Fans worried for Game Changer movie first day collections due to no benefit shows in Telangana
Ram Charan-Game Changer: గేమ్ చేంజర్ విషయంలో చెర్రీ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.! మూవీ టీమ్ మాటేంటి.?
ప్రజెంట్ తెలుగు ఆడియన్స్ అందరూ గేమ్ చేంజర్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ సోలోగా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.అప్‌డేట్ రావాలనే గానీ ఇన్‌స్టాంట్‌గా వైరల్‌గా చేసేందుకు ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు. కానీ టీమ్ నుంచి మాత్రం ఈ స్పీడు కనిపించటం లేదు. అందుకే కాస్త జోరు పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Updated on: Dec 30, 2024 | 4:22 PM

ప్రజెంట్ తెలుగు ఆడియన్స్ అందరూ గేమ్ చేంజర్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ సోలోగా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.

మార్కెట్ పరంగా శంకర్ సినిమాతో పోటి పడే అవకాశం లేదు. అందుకే కోలీవుడ్ మార్కెట్‌లోనూ గేమ్ చేంజర్ సోలోగా బరిలో దిగుతున్నట్టే అంటున్నారు సినీ జనాలు. మరి ఈ అడ్వాంటేజ్ కలెక్షన్ల విషయంలో ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ట్రిపులార్ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా మీద అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

దీంతో గేమ్ చేంజర్‌కు కోలీవుడ్ మార్కెట్‌లో పోటి లేకుండా పోయింది. ప్రజెంట్ తమిళ మార్కెట్‌లో పొంగల్ బరిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వనాంగన్. అరుణ్ విజయ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్ ఉన్నా..

రిలీజ్‌కు మరో 15 రోజులు మాత్రమే ఉన్నా.. ఇంత వరకు ఇండియాలో ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు గేమ్ చేంజర్ మేకర్స్. అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా.. అది ఇండియన్ ఆడియన్స్‌కు చూపించే ప్రయత్నం చేయట్లేదు.

టీజర్‌తో పాటు నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసిన యూనిట్ ట్రైలర్ రిలీజ్ విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 27, 28 తారీఖుల్లో ట్రైలర్ లాంచ్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ యూనిట్ సైడ్ నుంచి అలాంటి ప్రకటన అయితే రాలేదు.

దీనికి తోడు తెలంగాణలో భారీ ఈవెంట్ చేసే పరిస్థితి లేకపోవటం కూడా గేమ్ చేంజర్ టీమ్‌కు ఇబ్బంది కరంగా మారింది. ఇక టికెట్ రేట్ల హైక్, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చేయటంతో గేమ్ చేంజర్ డే వన్ వసూళ్ల రికార్డ్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది.

అందుకే భారీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.




