Allu Arjun: భన్సాలీతో పుష్పరాజ్ భేటి.. అసలు ఏంటీ ముచ్చట.?
పుష్పరాజ్ నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.! పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తన తదుపరి చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కడా కూడా కూడా తప్పు జరగకుండా చూసుకోవాలని చూస్తున్నాడు. ఈలోగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో భేటి అయ్యాడు..
అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ హీరో. పుష్ప తర్వాత ఈయన రేంజ్ ఊహించుకోడానికి కూడా భయమేస్తుంది. బయటికి చెప్పట్లేదు కానీ ఈ రేంజ్ బన్నీని కూడా భయపెడుతూనే ఉంటుంది లోపల. ఎందుకంటే ఈ రేంజ్ స్టార్ డమ్ చూసాక.. నెక్ట్స్ చేయడానికి ఏం ఉండదు.. ఏం చేసినా ఆడియన్స్‌కు అంత ఈజీగా నచ్చదు. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు అల్లు అర్జున్. ఏ చిన్న తప్పు కూడా జరక్కుండా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెట్టనున్నాడు బన్నీ. మార్చి నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యేలా కనిపిస్తుంది.
ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు అల్లు అర్జున్. నాలుగేళ్లుగా ఉన్న గడ్డం ఈ మధ్యే తీసి కొత్త లుక్‌లోకి మారిపోయాడు బన్నీ. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ముంబై వెళ్లాడు. దాంతో అసలు చర్చ మొదలైంది. అక్కడ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కలిసాడు. ఆయన ఆఫీస్‌లో కాసేపు ఉండటమే కాదు.. కీలకమైన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. భన్సాలీ ఆఫీస్ నుంచి బన్నీ బయటికి వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఏదైనా వస్తుందా అనే ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 తర్వాత బాలీవుడ్‌లో బన్నీ పేరు వినిపించడం కాదు.. మార్మోగిపోతుంది. ఇప్పుడు భన్సాలీ మీటింగ్ చూసాక బన్నీ స్ట్రెయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి