Cockfighting: హైటెక్ సెటప్‌తో స్టేడియం తలపించేలా బరులు
మ్ముంటే పట్టుకోర షెకావతు.. పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు..! పుష్ప సినిమాలో ఈ డైలాగ్ ఎర్ర చందనం గురించైతే.. ఇలాంటి మాట ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కోడిపందాల బరుల దగ్గరా వినిపిస్తోంది. "దమ్ముంటే పట్టుకోర షెకావతూ" అంటూ పోలీసులకి దొరక్కుండా కోడి పందాలకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అన్నిచోట్లా పందాలకు ఓ రేంజ్‌లో బరులు రెడీ అయ్యాయ్..
సంక్రాంతి సందడి జోరందకుంది. తగ్గేదేలా అనే రేంజ్‌లో హైటెక్ బరులను సిద్ధం చేస్తున్నారు. కోర్టు ఆదేవాలతో బరులపై కొరడా ఝులిపిస్తున్నారు పోలీసులు. ఎవరు ఔనన్నా కాదన్నా కొక్కొరోకో పందాలాట ఆగేదేలేదంటున్నారు. ఏకంగా స్టేడియాన్ని తలపించేలా హంగు ఆర్భాలు చేస్తున్నారు. వానొచ్చినా సరే ఆట కొనసాగేలా రూఫ్ టాప్ …బరి చుట్టూరా స్క్రీన్లు… లైవ్ టెలికాస్ట్.. లైటింగ్ స్టేజ్..అదిరేటి సౌండ్ సిస్టమ్.. ఇలా ఒకటా రెండా ఈసారి సంక్రాంతి సంబరాలకు కళ్లు చెదిరే ఎఫెక్ట్ ఇస్తున్నారు. కోట్లలో సిరులు కురిపించే పందాల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసి బరులు సిద్ధంచేసేశారు. కోడి పందాలు లేకపోతే అది సంక్రాంతి కాదంటున్నారు నిర్వాహకులు.
సంప్రదాయం కోసమే పందాంటున్నారు పందెంరాయుళ్లు . ఇదంతా ఒకవైపు. మరోవైపు బరి తెగిస్తే బెండు తీస్తామని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పందెం బరులపై నిఘా పెంచారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులపై పోలీసలు మెరుపు దాడులు చేస్తున్నారు. కోడి పందాలను అడ్డుకోవాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం బరులను ధ్వంసం చేస్తున్నారు పోలీసులు.
పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పల్లెపల్లెన ప్రచారం చేస్తున్నారు పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా బరులను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. పందాలు లేకపోతే అది పండగే కాదని నిర్వాహాకులు బరి గీస్తున్నారు. ఎట్ట పరిస్థితుల్లో పందాలు జరగనివ్వమంటున్నారు పోలీసులు. ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తోన్న సరే పందెం రాయుళ్లు మాత్రం తగ్గేదిలే అంటూ బరుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.