AP News: టీ కోసం డాబా దగ్గర కారు ఆపారు.. తీరా డ్రైవర్ చేసిన పనికి బిత్తరపోయారు

AP News: టీ కోసం డాబా దగ్గర కారు ఆపారు.. తీరా డ్రైవర్ చేసిన పనికి బిత్తరపోయారు

Ravi Kiran

|

Updated on: Jan 12, 2025 | 1:47 PM

నిన్న ఎన్టీఆర్‌ జిల్లాలో సినిమా స్టైల్‌లో ఆరున్నర కేజీల బంగారంతో ఉడాయించాడో కేటుగాడు. ఆ బంగారం విలువ 5 కోట్లపైనే ఉంటుందంటున్నారు. మరి దొంగ దొరికాడా...? పోలీసులేమంటున్నారు...? అసలు ఇంతకీ ఆ వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.? అదేంటంటే

సినీ ఫక్కీలో 5 కోట్లకుపైగా విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్‌ పరారైన ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బంగారం డెలివరీ చేసేందుకు కారు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. జగ్గయ్యపేట వద్ద టీ కోసం ఆగడంతో ముగ్గురు వ్యక్తుల కళ్లుగప్పి డ్రైవర్‌ బంగారంతోపాటు కారుతో ఉడాయించాడు. కారుకు జీపీఎస్‌ ట్రాకర్‌ ఉండటంతో నందిగామ వద్ద కారును వదిలి బంగారాన్ని తీసుకొని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కారు డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ఛాలెంజింగ్‌ తీసుకున్న పోలీసులు… నిందితుడిని అతి త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.

ఇది చదవండి: 

ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?

కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jan 12, 2025 01:47 PM