AP Rains: బాబోయ్.. మళ్లీనా.. ఏపీలో ఈ ప్రాంతాలకు మోస్తరు వానలు.. తాజా వెదర్ రిపోర్ట్
బాబోయ్.! ఇదేంటి భయ్యా మళ్లీనా.. ఏపీకి మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరి ఆ ఆవర్తనంతో రాష్ట్రమంతటా వర్షాలు ఎక్కడెక్కడ పడుతాయో.. అమరావతి వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.!
నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అనగా శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం, సరిహద్దు నైరుతి బంగాళాఖాతంలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————
ఈరోజు:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:- ————–

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి