School Holidays: 2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!

2025 School Holidays: సాధారణంగా ప్రభుత్వాలు ఆయా డిసెంబర్‌ నెల రాగానే వచ్చే సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన సెలవులు, అలాగే వివిధ పండగలకు సంబంధించిన సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి సెలవుల జాబితా ఉలా ఉంది..

School Holidays: 2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2025 | 4:16 PM

పాఠశాలలు, సంస్థలకు జాతీయ, రాష్ట్ర సెలవులతో సహా 2025కి సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. స్టడీ మెటీరియల్‌ను సేకరించడంతో పాటు, సంవత్సరానికి సంబంధించిన సెలవు క్యాలెండర్‌ను ఇటీవల ప్రకటించింది. పాఠశాలలకు 2025 సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇది అన్ని ఏపీ బోర్డు పాఠశాలలకు వర్తిస్తుంది. హాలిడే క్యాలెండర్ జాబితా అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ విడుదల చేసిన జాబితాలో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు కలుపుకొని మొత్తం 44 రోజులు సెలవులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం.. 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

S. No.

పండుగ

తేదీ

రోజు

1
భోగి
13.01.2025
సోమవారం
2
మకర సంక్రాంతి
14.01.2025
మంగళవారం
3
కనుమ
15.01.2025
బుధవారం
4
రిపబ్లిక్ డే
26.01.2025
ఆదివారం
5
మహా శివరాత్రి
25.02.2025
బుధవారం
6
హోలీ
14.03.2025
శుక్రవారం
7
ఉగాది
30.03.2025
ఆదివారం
8
ఈద్-ఉల్-ఫిత్ర్ (రంజాన్)
31.03.2025
సోమవారం
9
బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
05.04.2025
శనివారం
10
శ్రీరామ నవమి
06.04.2025
ఆదివారం
11
డా. బ్రాంబేద్కర్ పుట్టినరోజు
14.04.2025
సోమవారం
12
శుభ శుక్రవారం
18.04.2025
శుక్రవారం
13
బక్రీద్ (ఈద్-ఉల్-జుహా)
07.06.2025
శనివారం
14
మొహర్రం
06.07.2025
ఆదివారం
15
వరలక్ష్మి వ్రతం
08.08.2025
శుక్రవారం
16
స్వాతంత్ర్య దినోత్సవం
15.08.2025
శుక్రవారం
17
శ్రీకృష్ణాష్టమి
16.08.2025
శనివారం
18
వినాయక చవితి
27.08.2025
బుధవారం
19
ఈద్ మిలాద్ ఉన్ నబీ
05.09.2025
శుక్రవారం
20
దుర్గాష్టమి
30.09.2025
మంగళవారం
21
మహాత్మా గాంధీ జయంతి, విజయ దశమి
02.10.2025
గురువారం
22
దీపావళి
20.10.2025
సోమవారం
23
క్రిస్మస్
25.12.2025
గురువారం

2025లో ఆదివారాల్లో వచ్చే పండుగలు

S.No.

పండుగలు 

తేదీ

రోజు

1
రిపబ్లిక్ డే
26.01.2005
ఆదివారం
2
ఉగాది
30.01.2021
ఆదివారం
3
శ్రీరామ నవమి
06.04.2020
ఆదివారం
4
మొహర్రం
06.07.2020
ఆదివారం

2025లో మొత్తం 23 సెలవు దినాలుగా పేర్కొంది ఏపీ సర్కార్‌. ఇందులో నాలుగు సెలవులు ఆదివారం వచ్చాయి. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం వచ్చాయి. అందుకే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో కేవలం 19 మాత్రమే ఉద్యోగులకు లభిస్తాయి. అక్టోబర్ 2 గాంధీజయంతి, విజయదశమి రెండు సెలవులు కూడా కలిసిపోయాయి. వీటితోపాటు 21 ఆప్షనల్ హాలిడేలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ముందస్తు సమాచారంతో ఐదు సెలవుల దినాలను అధికారులు వాడుకోవచ్చు. ఇందులో కూడా ఈద్-ఈ- గదర్, మహలాయ అమావాస్య ఆదివారం వస్తున్నాయి. మే నవంబర్‌లో ఎలాంటి సెలవులు లేకపోగా.. జనవరి ఏప్రిల్‌, ఆగస్టులో ఎక్కువగా నాలుగు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా ఏడాదిలో పది నెలల్లో సెలవులు ఉన్నాయి.. రెండు నెలల్లోనే ఎలాంటి సెలవులు లేవని గమనించాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి