Pawan Kalyan: మీరూ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే.. తిరుపతి ఘటనపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి ఘటనకు బాధ్యత వహిస్తూ తాను ప్రజలకు క్షమాపణలు చెప్పానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టీటీడీ ఈవో సహా అధికారులందరూ బాధితులకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. కొందరు అధికారులు పని చేయడం మానేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు.

Pawan Kalyan: మీరూ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే.. తిరుపతి ఘటనపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2025 | 3:56 PM

తప్పు ఎవరిదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే.. తిరుపతి ఘటనపై తాను క్షమాపణలు అడిగానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు.. ఈవో, ఏఈవో క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఏంటని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు చేసిన తప్పుకు ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పాటించే హిందువులును క్షమాపణ అడిగాను.. ఎవరి భాద్యత వాళ్ళు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. ఎక్కడ ఎలా స్పందించాలో యువత కూడా ఆలోచించాలి. చావులు దగ్గర కేరింతలు, అరుపులు భావ్యం కాదని పవన్ హితబోధ చేశారు. ప్రజలిచ్చిన గెలుపుతోనే టీటీడీ చైర్మన్ అయినా.. ఈవో అయినా.. సీఎం చంద్రబాబు, తానైనా.. అందుకే టీటీడీ అధికారులు కూడా కచ్చితంగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి బాధితులు ఆస్పత్రిలో మాట్లాడుతుంటే కళ్లు చమ్మగిల్లాయి. పరిస్థితిని ఎలా అదుపు చెయ్యాలో సరైన ఆలోచన లేక 11 వందల మంది పోలీసులు ఏం చేయలేకపోయారు.

అలాగే తప్పు చేసే వాళ్లను కూటమి ప్రభుత్వంలో ఎవరూ వెనకేసుకు రారన్నారు పవన్ కళ్యాణ్. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారులకు హనీమూన్ పిరియడ్ అయిపోయిందని.. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. తాను తెగించి రాజకీయాల్లోకి వచ్చానని.. మందుపాతరలు పెట్టి పేల్చుతామన్నా భయపడేది లేదని.. ఆకు రౌడీలు, చిల్లర వేషాలు వేసేవాళ్లకు అస్సలు భయపడనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి