Boy Kidnap: పిల్లలు లేని వారికి విక్రయించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్.. చేధించిన పోలీసులు

ఎప్పటిలాగే నిన్న ఉదయం కూడా ఆరిఫ్ ఖాన్ ఇంటి దగ్గరలోని అంగన్ వాడీ సెంటర్ లో వదిలి పెట్టి వచ్చాడు. ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన బాలుడు చిరుతిండి కొనుక్కుంటానని చెప్పటంతో చిల్లర డబ్బులిచ్చి తండ్రి పంపించాడు. అదే సందులో ఉన్న దుకాణం వద్దకు వెళ్లిన ఆలీ ఖాన్ ఎంతసేపటికి తిగిరి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు...

Boy Kidnap: పిల్లలు లేని వారికి విక్రయించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్.. చేధించిన పోలీసులు
Boy Kidnap
Follow us
T Nagaraju

| Edited By: Subhash Goud

Updated on: Oct 17, 2023 | 4:11 PM

సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం.. గుంటూరు నగరంలోని షకీర్ గూడెం ప్రాంతం. నాలుగేళ్ల బాలుడు చిరుతిండి కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వచ్చాడు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడు కిడ్నాప్ అయినట్లు సిసి కెమెరా విజువల్స్ ద్వారా గుర్తించారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుండి ఎనిమిది గంటల్లోనే బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

షకీరు గూడెంకు చెందిన ఆరిఫ్ కాన్, రేష్మల రెండో కొడుకు ఆలీఖాన్ కు నాలుగేళ్లు. ఎప్పటిలాగే నిన్న ఉదయం కూడా ఆరిఫ్ ఖాన్ ఇంటి దగ్గరలోని అంగన్ వాడీ సెంటర్ లో వదిలి పెట్టి వచ్చాడు. ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన బాలుడు చిరుతిండి కొనుక్కుంటానని చెప్పటంతో చిల్లర డబ్బులిచ్చి తండ్రి పంపించాడు. అదే సందులో ఉన్న దుకాణం వద్దకు వెళ్లిన ఆలీ ఖాన్ ఎంతసేపటికి తిగిరి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి కెమెరా విజువల్స్ పరిశీలించిన పోలీసులకు ఉద్దేశపూర్వకంగానే బాలుడిని ఇద్దరు మైనర్లు తీసుకెళ్లినట్లు అర్దమైంది. వెంటనే మైనర్లను అదుపులోకి తీసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే అప్పటికే బాలుడిని హుస్సేన్ ఇంట్లో నిందితులు బంధించి ఉంచారు. పిల్లలు లేని వారికి విక్రయించాలన్న ఉద్దేశంతోనే బాలుడిని మైనర్ల సాయంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హుస్సేన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే నిందితులు పరారయ్యారు. బాలుడిని రక్షించిన పోలీసులు వెంటనే ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ వద్దకు తీసుకెళ్లారు. వెంటనే ఎస్పీ తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి