AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో 2 నెలల్లో ఇంటింటికి తాగునీరు.. మారుమూల గ్రామాలకూ కొత్త రోడ్లు

డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్యాపిలి ప్రారంభోత్సవాల పర్యటనలో భాగంగా మునిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు.

మరో 2 నెలల్లో ఇంటింటికి తాగునీరు.. మారుమూల గ్రామాలకూ కొత్త రోడ్లు
Buggana Rajendranath
Balaraju Goud
|

Updated on: Oct 17, 2023 | 2:39 PM

Share

డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్యాపిలిలోని రూ.5.5 కోట్లతో నిర్మించిన సరికొత్త రహదారులను ఆయన మంగళవారం ప్రారంభించారు. గార్లదిన్నె నుంచి అలేబాదు వరకు రూ.3 కోట్ల నిధులతో 4 కి.మీ మేర కొత్త రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. మునిమడుగు నుంచి అలేబాదు తండా వరకు రూ.2.5కోట్లతో 5 కి.మీ మేర నూతన రహదారిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాదయాత్ర చేస్తూ ముందుకు సాగారు బుగ్గన.

ప్యాపిలి ప్రారంభోత్సవాల పర్యటనలో భాగంగా మునిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గార్ల దిన్నె, మునిమడుగు, అలేబాదు, అలేబాదు తాండ ప్రజలతో కలిసి నడుస్తూ ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

డోన్ నియోజకవర్గం వ్యాప్తంగా నీటి సమస్య త్వరలోనే తొలగిపోతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భరోసా ఇచ్చారు. వర్షం వచ్చినా రాకున్నాఇబ్బంది కలగని విధంగా డిసెంబర్ కల్లా పైప్ లైన్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్యాపిలిలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తామన్నారు. అలేబాద్ గ్రామంలోని సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే