Lemon: టేస్ట్ కోసం నిమ్మరసం పిండుకోని తింటున్నారా..? వామ్మో.. అలా చేస్తే మీరు షెడ్డుకెళ్లినట్లే..
నిమ్మకాయలో ఎన్నో ఔషధగుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే నిమ్మకాయను ఎక్కువగా వినియోగిస్తారు. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసాన్ని తీసుకుంటే శరీరంలోని మలినాలన్నీ బయటకు వస్తాయి. అంతేకాకుండా.. నిమ్మకాయ అన్ని రకాల వంటలలో ఉపయోగించే ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. నిమ్మకాయను భారతీయ వంటలలో తరచుగా ఉపయోగిస్తారు.
నిమ్మకాయలో ఎన్నో ఔషధగుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే నిమ్మకాయను ఎక్కువగా వినియోగిస్తారు. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసాన్ని తీసుకుంటే శరీరంలోని మలినాలన్నీ బయటకు వస్తాయి. అంతేకాకుండా.. నిమ్మకాయ అన్ని రకాల వంటలలో ఉపయోగించే ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. నిమ్మకాయను భారతీయ వంటలలో తరచుగా ఉపయోగిస్తారు. స్పష్టంగా చెప్పాలంటే.. అన్ని వంటకాల్లో నిమ్మకాయ అంతర్భాగం. అయితే ఈ నిమ్మకాయను కొన్ని వస్తువులతో కలిపి తీసుకుంటే ప్రమాదమేనంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు..
ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వంటల రుచిని పెంచే నిమ్మకాయ కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పదార్థాలతో తీసుకుంటే.. అనారోగ్యానికి గురవుతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
- పాల ఉత్పత్తులు: ఏ రకమైన పాల ఉత్పత్తులతో కూడా నిమ్మకాయను ఉపయోగించవద్దు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పాలు, నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం. దీంతో గుండెల్లో మంట, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
- స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్ తినే సమయంలో నిమ్మకాయను ఉపయోగించడం మానుకోండి. నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తీవ్రంగా పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మకాయను మసాలా పెంచేది అని కూడా అంటారు. మీరు మసాలా భోజనంలో నిమ్మరసం కలిపితే, అది మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే అవకాశం ఉంది.
- రెడ్ వైన్: కొన్ని ఆహారపదార్థాల మాదిరిగానే నిమ్మకాయను రెడ్ వైన్‌తో కలిపి తినకూడదు. నిమ్మకాయలు వైన్ రుచి, వాసనను పాడు చేస్తాయి. మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
- పెరుగు – మజ్జిగ : పెరుగు లేదా మజ్జిగలో నిమ్మకాయను కలపడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తులలో నిమ్మరసం జోడించడం ఆరోగ్యానికి హానికరం. ఇది పెరుగు -మజ్జిగ రుచిని పాడు చేయడంతోపాటు.. శరీరంలో ఎసిడిటీని కలిగిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..