Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను ఎందుకు రద్దు చేశారో తెలుసా..? రైల్వే అధికారులు చెబుతున్న వివరణ ఏంటంటే..

Guntur division: ఇటీవల కాలంలో నాలుగు నెలలుగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్ల రాకపోకల సమయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐదు నెలలుగా ఏ ఒక్క ట్రైను సరైన సమయానికి వచ్చిన పరిస్థితి లేదు. విశాఖ నుంచి 37 ట్రైన్స్ బయలుదేరుతుండగా, మరో 130 ట్రైన్స్ విశాఖ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటాయి ఒక్క విశాఖ నుంచి బయలుదేరే 30 ట్రైన్స్ తప్ప మిగతా ట్రైన్లు అన్నీ కూడా దాదాపు సరాసరి 4 5 గంటల ఆలస్యంగా నడుస్తుంటే ఒక్కోసారి విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్స్ కూడా ఆలస్యం అవుతుంటాయి. అటువైపు నుంచి రావాల్సిన

Andhra Pradesh: జన్మభూమి ఎక్స్  ప్రెస్ ను ఎందుకు రద్దు చేశారో తెలుసా..? రైల్వే అధికారులు చెబుతున్న వివరణ ఏంటంటే..
Cancelled Trains
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 09, 2023 | 8:48 AM

విశాఖపట్నం, అక్టోబర్09; గుంటూరు డివిజన్ పరిధిలో జరుగుతున్న ఇంటర్ లాకింగ్ భద్రతా పనుల నేపథ్యంలో జన్మ భూమి ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ ప్రకటించింది. హైదరాబాద్ – విశాఖ మధ్య నడిచే అత్యంత ప్రధానమైన రైళ్లలో జన్మభూమి ఒకటి. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ట్రైన్ నంబర్ 12805 జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది వాల్తేరు డివిజన్. అదే సమయం లో లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ నంబర్ 12806 జన్మభూమి ఎక్స్ప్రెస్ ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ త్రిపాఠి తెలిపారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనకాపల్లి-తాడి స్టేషన్ల మధ్య జరుగుతున్న డీప్ స్క్రీనింగ్ పనుల నేపథ్యంలో ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కూడా రేపటివరకు రద్దయింది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రత్నా చల్ తో పాటు పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు.

ట్రాక్ ల ఆధునీకరణ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు అస్తవ్యస్తం

ఇటీవల కాలంలో నాలుగు నెలలుగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్ల రాకపోకల సమయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐదు నెలలుగా ఏ ఒక్క ట్రైను సరైన సమయానికి వచ్చిన పరిస్థితి లేదు. విశాఖ నుంచి 37 ట్రైన్స్ బయలుదేరుతుండగా, మరో 130 ట్రైన్స్ విశాఖ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటాయి ఒక్క విశాఖ నుంచి బయలుదేరే 30 ట్రైన్స్ తప్ప మిగతా ట్రైన్లు అన్నీ కూడా దాదాపు సరాసరి 4 5 గంటల ఆలస్యంగా నడుస్తుంటే ఒక్కోసారి విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్స్ కూడా ఆలస్యం అవుతుంటాయి అటువైపు నుంచి రావాల్సిన పెయిరింగ్ ట్రైన ఆలస్యం కావడంతో బయలుదేరే ట్రైన్స్ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈస్ట్ కోస్ట్ డివిజన్ తో పాటు సౌత్ సెంట్రల్ డివిజన్లో జరుగుతున్న పలు రకాల ట్రాక్ ల ఆధునికీకరణ, డబ్లింగ్, ట్రాక్ మరమ్మతులు, డీప్ స్టీటింగ్, పనుల లాంటి వాటితో ట్రైన్ ప్రయాణం నరక ప్రాయం గా మారింది దీంతో పలువురు ప్రత్యామ్నాయాలని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒడిశాలోని రాయగడ్ లో కోణార్క్ ఎక్స్ప్రెస్ కి జరిగిన ఘోర ప్రమాదం తర్వాత మొత్తం ట్రాక్ ల ఇంటర్ లాకింగ్ వ్యవస్థని ఆధునికరించడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు

ఇవి కూడా చదవండి

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను చాలా కీలకమైంది. విశాఖపట్నం నగరం తో పాటు ఉత్తరాంధ్ర కు సేవలందించే అత్యంత ప్రధానమైన రైల్వేస్టేషను ఇది. ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో, అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద రైల్వేస్టేషన్లలో విశాఖ జంక్షన్ ఒకటి. హౌరా నుండి చెన్నై వెళ్ళు ప్రధాన రైలుమార్గం కూడా. దేశం మొత్తం గా చూస్తే రద్దీగా ఉండే స్టేషన్ల లో 20 వ స్టేషన్.

విశాఖ నుంచి రోజూ 50 వేల మంది ప్రయాణికులు..

విశాఖ నుంచి రోజు 50 వేల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో 150 పైగా ట్రైన్స్ విశాఖ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ ఇటీవల కాలంలో బోసి పోతుంది. సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా రైళ్లన్నీ విశాఖ చేరుతుంటాయి ఆ సమయంలో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం రైళ్లన్నీ నాలుగైదు గంటలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఉదయాన్నే పెద్దగా రద్దీ ఉండడం లేదు. దీంతో మా ఉపాధి కూడా తీవ్రంగా దెబ్బతింటుంది అంటూ ఆటో డ్రైవర్లు కూడా వాపోతున్నారు. ఇది మరి కొంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..