రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే బీపీ పెరుగుతుందా..?.. అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

25 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 65,000 మంది మహిళలను ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఎంపిక చేశారు. ఇది పదహారేళ్ల సుదీర్ఘ అధ్యయనం. వారిలో చాలామందికి చదువుకునే సమయంలో బీపీ సమస్యలు లేవు. అయితే ఆ తర్వాత చాలా మందికి బీపీ పట్టుకుంది. వీరందరికీ నిద్ర సమస్యలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నిద్రలేమి, నిద్రలో లేవడం, గాఢనిద్ర రాకపోవడం

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే బీపీ పెరుగుతుందా..?.. అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 09, 2023 | 8:23 AM

కొంతమందికి ఎంత ప్రయత్నించినా రాత్రుళ్లు అస్సలు నిద్రపట్టదు. ఏవే ఆలోచనలు వెంటాడుతుంటాయి. దాంతో ప్రయత్నించినా నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. అలా అర్ధరాత్రి ఒంటి గంటా, రెండు దాటినా కూడా నిద్రపట్టదు. దీనివలన అలాంటి వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా ప్రభావం ఉంటుంది. ప్రతి రోజూ రాత్రుళ్లు 7-8 గంటలు సరైన నిద్ర లేక పోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హై బీపీ.. అధిక రక్తపోటు ముఖ్యంగా గుండెకు ప్రమాదకరం. గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. కాబట్టి బీపీ పెరగకుండా చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది. అధిక బిపికి దారితీస్తుందని బహుశా మీరు వినివుండే ఒక విషయం ఏమిటంటే.. రాత్రి వేళల్లో మంచి నిద్రపోకపోవడం. నిజానికి రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే బీపీ పెరుగుతుందా? అలాంటి ‘రిస్క్’ ఉందా? అనే అంశాన్ని పరిశీలించినట్టయితే.. నిద్ర సక్రమంగా లేకపోతే అది కచ్చితంగా బీపీ హెచ్చుతగ్గులకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా వారు రాత్రి (కనీసం 7 గంటలు) మంచి నిద్రపోయేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు ప్రముఖ హెల్త్ పబ్లికేషన్ ‘హైపర్‌టెన్షన్’లో ప్రచురించబడిన అధ్యయన నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. రాత్రిపూట మంచి నిద్ర సక్రమంగా లేకపోతే మహిళల్లో బీపీ పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

25 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 65,000 మంది మహిళలను ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఎంపిక చేశారు. ఇది పదహారేళ్ల సుదీర్ఘ అధ్యయనం. వారిలో చాలామందికి చదువుకునే సమయంలో బీపీ సమస్యలు లేవు. అయితే ఆ తర్వాత చాలా మందికి బీపీ పట్టుకుంది. వీరందరికీ నిద్ర సమస్యలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నిద్రలేమి, నిద్రలో లేవడం, గాఢనిద్ర రాకపోవడం వంటి సమస్యలన్నీ హైబీపీకి దారితీస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

లింగంతో పాటు, వయస్సు, జాతి, భౌగోళిక వ్యత్యాసాలు, ఆరోగ్య పరిస్థితులు, శరీర బరువు, BP వంశపారంపర్యత కూడా అనేక ఇతర అంశాలను ప్రభావితం చేస్తాయని అధ్యయనం కనుగొంది. వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, నిద్ర లేకపోవడం కూడా బీపీని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?