Chandrababu Naidu: ఇవాళ చంద్రబాబుకు బిగ్ డే.. సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సంబంధించి ఇవాళ వేర్వేరు కోర్టుల్లో వేర్వేరు పిటిషన్లపై తీర్పురానుంది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా తీర్పు రానుంది.
ఇవాళ చంద్రబాబుకు బిగ్ డే అని చెప్పాలి. ఆయనకు సంబంధించిన కేసులు, పిటిషన్లపై కోర్టుల్లో కీలక విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నెలరోజులుగా జైలులో ఉన్న చంద్రబాబుకు ఊరట లభిస్తుందా? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సంబంధించి అక్టోబర్ తొమ్మిదవ తేదీ.. బిగ్ డేగా మారనుంది.
ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా తీర్పు రానుంది. ఇక ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై కూడా సోమవారం నాడే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.
హైకోర్టులో కేసులకు సంబంధించి.. అంగళ్లు కేసులో నిందితులు అందరికి బెయిల్ ఇచ్చేశారు కాబట్టి…చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు న్యాయవాది వెంకటేష్ శర్మ. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు తరఫు లాయర్లు.. రెండు రకాలుగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారని ఆయన చెబుతున్నారు.
స్కిల్ స్కామ్‌లో కేసులో చంద్రబాబు అరెస్ట్, పిటిషన్లు, విచారణకు సంబంధించిన స్కిల్ కేసు డైరీ తిరగేస్తే పరిణామాలు చకచకా సంభవించాయి.
- సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్
- సెప్టెంబర్ 10న రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
- సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- సెప్టెంబర్ 14న ఏసీబీ కోర్ట్‌లో బెయిల్ పిటిషన్
- సెప్టెంబర్ 15కి బెయిల్ పిటిషన్ వాయిదా
- సెప్టెంబర్ 19న రిమాండ్ సస్పెండ్ చేయాలని, ఎఫ్‌ఐఆర్ కొట్టెయ్యాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు.
- సెప్టెంబర్ 22న రెండు రోజుల సీఐడీ కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు
- సెప్టెంబర్ 22న హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ డిస్మిస్
- సెప్టెంబర్ 24వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
- అక్టోబర్ 5న మరోసారి రిమాండ్ పొడిగింపు
- అక్టోబర్ 19వరకు జ్యుడీషియల్ రిమాండ్
- అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు
- అక్టోబర్ 9కి సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై విచారణ
- అక్టోబర్ 9న హైకోర్టులో ఇన్నర్‌రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్‌పై తీర్పు
- అక్టోబర్ 9న బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పు
చంద్రబాబు కస్టడీలో లేరు కాబట్టి.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ ఏజీ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదించారని న్యాయవాది శర్మ తెలిపారు. అయితే చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వకపోవచ్చని అడ్వొకేట్ శర్మ అభిప్రాయపడ్డారు. కానీ బాబుకు బెయిల్ వచ్చే మరోవైపు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కీలక సాక్షి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ వాదించారని న్యాయవాది శర్మ తెలిపారు. ఏసీబీ కోర్టుకు సంబంధించి చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వకపోవచ్చని అడ్వొకేట్ శర్మ అభిప్రాయపడ్డారు. అయితే బాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నారు ఆయన. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారని అడ్వొకేట్ శర్మ తెలిపారు. మొత్తానికి చంద్రబాబు కేసులకు సంబంధించి సోమవారం బిగ్ డేగా మారే ఛాన్స్ ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి