TDP And Janasena: అవును..! వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.. టీడీపీ – జనసేన టికెట్‎పై వీడిన ఉత్కంఠ..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో నిన్న మొన్నటి వరకు వారిద్దరి మధ్య రాజకీయ పొరపొచ్చాలు కొనసాగేవి. వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేనప్పటికీ టిక్కెట్ విషయాల్లో రాజకీయంగా కాస్త దూరం ఏర్పడింది. పొత్తులో టిక్కెట్ నీదా.. నాదా.. నాదంటే.. నాదే అనే స్థాయిలో ఒకర్నోకరు పోటీపడ్డారు. అధిష్ఠానం నిర్ణయాలు, బుజ్జగింపులతో మొత్తానికి వారి మధ్య సయోధ్య కుదిరింది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.

TDP And Janasena: అవును..! వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.. టీడీపీ - జనసేన టికెట్‎పై వీడిన ఉత్కంఠ..
Buchaiah Chaudhary And Kandula Durgesh
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 07, 2024 | 6:02 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో నిన్న మొన్నటి వరకు వారిద్దరి మధ్య రాజకీయ పొరపొచ్చాలు కొనసాగేవి. వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేనప్పటికీ టిక్కెట్ విషయాల్లో రాజకీయంగా కాస్త దూరం ఏర్పడింది. పొత్తులో టిక్కెట్ నీదా.. నాదా.. నాదంటే.. నాదే అనే స్థాయిలో ఒకర్నోకరు పోటీపడ్డారు. అధిష్ఠానం నిర్ణయాలు, బుజ్జగింపులతో మొత్తానికి వారి మధ్య సయోధ్య కుదిరింది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వారే టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ జనసేన ఇంఛార్జి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్.. తనకు తాను తగ్గించుకుని అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో, చంద్రబాబు భరోసాతో నిడదవోలులో జనసేన- టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు కందుల దుర్గేష్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజమండ్రి రూరల్‎ టిడిపి – జనసేనలో నెలకొన్న టిక్కెట్టు విషయంలో ఉన్న ఉత్కంఠకు తెరపడిందంటున్నారు ఇరు వర్గాలు. టెన్షన్ పడ్డ బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది. మొన్న రాత్రి కందుల దుర్గేష్ కడియం మండలంలో జనసైనికులతో అభిమానులతో సమావేశం నిర్వహించి ఆవేదనలో ఉన్న వారిని ఓదార్చారు. అధిష్టానం ఆదేశాలతో నిడదవోలులో పోటీ చేస్తున్నట్టు అక్కడ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రాజమండ్రిలోని రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ కార్యాలయానికి ఆకస్మికంగా, మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి వెళ్లారు. అక్కడ దుర్గేష్, గోరంట్ల ఆత్మీయంగా పలకరించుకుని, ఆత్మీయంగా కౌగిలించుకుని మాట్లాడుకున్నారు. కందుల దుర్గేష్‎తో సమావేశమై ఎన్నికల వ్యూహంపై కొంత సేపు గోరంట్ల చర్చించారు. గోరంట్లతో పాటు టిడిపి నేతలు కూడా దుర్గేష్‎ను కలిశారు. నిడదవోలుకు దుర్గేష్ వెళ్లడాన్ని గోరంట్ల అభినందిస్తూ, అక్కడ పార్టీ ముఖ్య నాయకులలో కొందరిని కందులకు పరిచయం చేశారు. రాజమండ్రి రూరల్‎లో పూర్తి సహకారం అందించాలని కందులను గోరంట్ల కోరారు. గోరంట్ల వెంట తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు ఉన్నారు. కందుల దుర్గేష్‎తో కలిసి గోరంట్ల ఫోటోలు దిగడంతో నిన్న మొన్నటివరకు దుర్గేష్‎కే రాజమండ్రి రూరల్ సీటు కేటాయించాలంటూ నిరసన తెలిపిన వారంతా వీరి కలయికతో సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు కందుల దుర్గేష్ వర్గీయులు.

జనసేన వచ్చే ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగిస్తుందని, అత్యధిక స్థానాలతో ప్రభుత్వంలోకి రాబోతుందని అన్నారు బుచ్చయ్య చౌదరి. అభివృద్ధి అనే పదానికి అర్ధం మారుస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెడుతూ ఒక నియంతని గద్దిదింపే దిశగా ఇరు పార్టీలు కృషి చేసి ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‎ల కలయిక చారిత్రక అవసరం అని గోరంట్ల అన్నారు. ఈ పొత్తు‎ని విచ్చినం చేసేలా వైసీపీ ప్రభుత్వం అనేక వ్యూహాలు రచిస్తుందని ఇది రామ్ గోపాల్ వర్మ సినిమాలగానే.. అట్టర్ ఫ్లాప్ అవుతుందని అన్నారు బుచ్చయ్య. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక వర్గం కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు. కేవలం రాష్ట్ర ప్రజలు మేలుకోసమే చేతులు కలిపాయని తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొత్తానికి రాజమండ్రి రూరల్ జనసేన కార్యాలయానికి వెళ్లి కందుల దుర్గేష్‎ని కలవడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లే అని ఇరుపార్టీల వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..