Andhra: అద్భుతం.! 108 అడుగుల జాంభవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా.?
కడప నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని అంగరంగ వైభవం గా తీర్చి దిద్దడానికి టీటీడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈఏడాది ఏప్రిల్ 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో జరిగే కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా భద్రాద్రిగా అధికారికంగా గుర్తించింది. ఒంటిమిట్ట అభివృద్ధి లో భాగంగా శ్రీకోదండరామాలయానికి ఎదురుగా ఉన్న చెరువులో108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒంటిమిట్ట తోపాటు ఈ మార్గంలోని ఆలయాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్ధం 50 సంవత్సరాల అవసరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలని ఆమేరకు ప్రణాళికలు తయారు చేయాలని టీటీడీ అంకురార్పణ చేసింది. రాష్ట్ర విభజన తరువాత చాలా ప్రాంతాల నుంచి ఒత్తిడి వచ్చినా ఎంతో చారిత్రక ప్రాభవం ఉన్న శ్రీకోదండరామాలయాన్ని 2014లో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాద్రిగా ప్రకటించారు. ఈ ఆలయంలో సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడు ఒకే శిలపై విగ్రహాలు చెక్కడం వల్ల దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అప్పటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాల్లో పట్టాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాల అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
కడప నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని అంగరంగ వైభవం గా తీర్చి దిద్దడానికి టీటీడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈఏడాది ఏప్రిల్ 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో జరిగే కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట ఆలయ పరిసరాలతో పాటు చెరువుకు కూడా మహర్దశ తెచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఒంటిమిట్ట అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసే బాధ్యతను ప్రసిద్ధ విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంవత్సరం ఆగష్టు 23 వ తేదీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ చిలకపాటి అనిల్ కుమార్ సారధ్యంలోని బృందం ఒంటిమిట్ట కు చేరుకొని ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించింది. దీనిపై వారు ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించి తమ బృందం ఒంటిమిట్టలో పర్యటించి పరిశీలించిన అంశాలను టీటీడీ కి అందించారు.
ఒంటిమిట్టను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారంటే
ముఖ్యంగా చెరువులో జాంబవంతుడి 108 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. పురాణాలూ ఇతిహసాల్లో పేర్కొన్న ప్రకారం జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవలింత నుంచి పుట్టిన యోధుడైన భల్లూక రాజు. రామాయణ గాధలో కూడా శ్రీరాముడితో కలిసి లంకా యుద్ధంలో జాంబవంతుడు పోరాడి తన శక్తియుక్తులు చాటాడు. హనుమంతుడికి శక్తిని గుర్తు చేసి, సీతాదేవికిని వెదకడానికి ప్రేరేపించిన మహాబలశాలిగాను, వివేకవంతుడిగాను ఆయనను చరిత్ర లో ప్రస్తావించారు. రామాయణం ప్రకారం రాముడి పక్షాన పోరాడిన జాంబవంతుడు యుద్దంలో సుగ్రీవుడు, అంగదుడికి సాయం చేశాడు. సముద్రం దాటమని హనుమంతుడిని జాంబవంతుడు ప్రోత్సాహించినట్లు సుందరకాండలో కూడా ప్రస్తావించారు అలాంటి యోధున్ని గుర్తుగా జాంబవంతుని విగ్రహాన్ని చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒంటిమిట్ట లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. దీనితో పాటు కడప చెన్నై ప్రధాన రహదారి కి ఓ పక్కన ఒంటిమిట్ట కోదండ రామాలయం మరో పక్కన సువిశాలమైనటువంటి 197 ఎకరాలలో ఒంటిమిట్ట చెరువు ఉంటుంది.సంజీవరాయస్వామి ఆలయం అభివృద్ధి మాట ఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామ, లక్షణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల్లో అభివృద్ధి, సుందరీకరణకు వారు ప్రణాళిక సిద్ధం చేశారు.




