TDP-Janasena: త్వరలోనే టీడీపీ-జనసేన రెండో జాబితా విడుదల.. పవన్ పోటీచేసేది ఎక్కడి నుంచి..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం - జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. మొదటి విడతగా మొత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

TDP-Janasena: త్వరలోనే టీడీపీ-జనసేన రెండో జాబితా విడుదల.. పవన్ పోటీచేసేది ఎక్కడి నుంచి..?
Chandrababu, Pawan Kalyan
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 07, 2024 | 9:45 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం – జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. మొదటి విడతగా మొత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన బర్లో ఉంటుందని పవన్ చెప్పారు. దానికి తగ్గట్టుగానే మొదటి విడతలో ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో 99 స్థానాల్లో 94 స్థానాల్లో టిడిపి తన అభ్యర్థులను ప్రకటించింది. ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. మొదటి విడత జాబితా ప్రకటన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చిన అసంతృప్తిని చల్లబరిచేందుకు రెండు పార్టీలు అధినేతలు అక్కడి నాయకులను పిలిచి మాట్లాడారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని ఆశావాహులను చంద్రబాబు ఎప్పటికప్పుడు పిలిచి మాట్లాడి సర్ది చెప్పి పంపించివేశారు. కొన్ని స్థానాల్లో టీడీపీకి సీట్లు కేటాయించడం పట్ల జనసేన నేతలు అసంతృప్తి వెళ్లగక్కారు. అలాంటి స్థానాల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పార్టీలు అధినేతలు ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజులుగా రెండో విడత జాబితా విడుదల పై కసరత్తు చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తుల కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బిజెపి నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో బీజేపీ నుంచి వచ్చే రిప్లై కోసం రెండు పార్టీలు అధినేతలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే మిగిలిన స్థానాల్లో కొన్నింటిని బీజేపీకి కేటాయించాల్సి వస్తుంది. అటు పార్లమెంటు స్థానాల్లోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రెండో విడత జాబితా పై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. త్వరలోనే జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు – పవన్ భేటిలో చర్చించిన అంశాలు ఇవే..

మంగళవారం జయహో బీసీ సభ తర్వాత చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే అది కాస్తా బుధవారానికి వాయిదా పడింది. ఉదయం 9.30కి ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు.. సుమారు గంటన్నర పాటు ఇరువురు భేటీ జరిగింది. ప్రధానంగా పొత్తుల అంశంతో పాటు రెండో విడత అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరిగినట్లు తెలిసింది. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇప్పటికి ఢిల్లీకి వెళ్లడంతో పుత్తులపై ఒక క్లారిటీ వస్తుందని రెండు పార్టీలు అధినేతలు భావిస్తున్నారు. పొత్తుల విషయం కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటుపై మాత్రమే ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆయా పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. పురందేశ్వరితో చర్చించిన తర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని.. తెలుగుదేశం – జనసేన నేతలు చెప్తున్నారు. త్వరలోనే చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని బీజేపీ పొత్తులపై చర్చలు కొలిక్కి వస్తాయని చెబుతున్నారు..

ఢిల్లీ నుంచి పిలుపు వస్తే సీట్ల విషయంలో సర్దుబాటు చేయాలనే దానిపై రెండు పార్టీల అధినేతలు మాట్లాడుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి వైపు రెండో విడత అభ్యర్థుల ఎంపిక పైన ఇరు పార్టీల నేతలు చర్చించుకున్నారు. మొదటి విడత జాబితా తర్వాత క్షేత్రస్థాయిలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులను ఎలా అధిగమించాలని దానిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడతలో ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి.. ఏ ఏ స్థానాలకు ఎవరెవరిని బరిలోకి దించాలి అనేదానిపై కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా సమాచారం. జనసేన కేటాయించిన 24 సీట్లలో మరొక 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే టిడిపి ఆశావాహుల నుంచి ఎలాంటి పరిస్థితి వస్తుందనే దానిపైన ఇరువురి నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది.

ఇటీవల రాబిన్ శర్మ టీంతో మూడు రోజులు పాటు సమావేశమైన చంద్రబాబు తాజా సర్వే నివేదికలను పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధిగమిస్తూ ఎలా ముందుకెళ్లాలని దానిపై విరుపార్టీలు అధినేతలు చర్చించుకున్నారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు రోజుల్లో బిజెపి పొత్తుల విషయం కొలికి వచ్చేస్తే ఆ వెంటనే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం కావాలని భావిస్తున్నారు. అటు ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు చర్చించారు. మేనిఫెస్టో విడుదల కూడా బీజేపీతో ముడిపడి ఉండడంతో త్వరితగతన అన్ని అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాలని నిర్ణయించారు.

జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి..?

అయితే, జనసేన సీట్ల విషయంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.. ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 11 చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.. ఉమ్మడి కృష్ణ జిల్లాల్లో అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ జనసేన కు ఖాయమైనట్లు తెలుస్తోంది. రైల్వే కోడూరు, రాజాం పేట సీట్లలో జనసేన కు ఒక సీట్, ఉమ్మడి విశాఖలో నాలుగు, ప్రకాశం జిల్లాలో ఒకటి, ఉమ్మడి చిత్తూరులో మదనపల్లి, తిరుపతి, అనంతపురం అర్బన్ జనసేనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.. దీంతో పాటు.. పవన్ పోటీ చేసే స్థానం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!