AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BJP: ఎటూ తేల్చని కోర్‌ గ్రూప్‌ మీటింగ్.. హస్తినకు చేరిన అభ్యర్థుల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఎటూ తేల్చకుండానే ముగిసింది బీజేపీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం. హస్తినలో నేడు మరోమారు సమావేశం జరగనుంది. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

AP BJP: ఎటూ తేల్చని కోర్‌ గ్రూప్‌ మీటింగ్.. హస్తినకు చేరిన అభ్యర్థుల జాబితా
Ap Bjp Core Group
Balaraju Goud
|

Updated on: Mar 07, 2024 | 9:36 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఎటూ తేల్చకుండానే ముగిసింది బీజేపీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం. హస్తినలో నేడు మరోమారు సమావేశం జరగనుంది. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, మాజీ చీఫ్‌ సోము వీర్రాజు హాజరై ఏపీలో బీజేపీ తరపున 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అర్థరాత్రి దాకా సాగిన చర్చల తర్వాత పురందేశ్వరి, సోము వీర్రాజు చర్చల వివరాలు తెలిపారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు.

మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రైవేట్ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు బీజేపీ హైకమాండ్‌ నుంచి ఇంకా ఎలాంటి అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అవలేదని తెలిసింది. అయితే ఆఖరు క్షణంలో బీజేపీ హై కమాండ్‌ నుంచి చంద్రబాబుకు పిలుపు రావచ్చని సమాచారం. చంద్రబాబుతో చర్చలు జరిగాక పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో అభ్యర్థుల జాబితాపైనా ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. చంద్రబాబు బుధవారం ఉండవల్లి నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. గంటన్నరపాటు సాగిన సమావేశంలో పొత్తుల అంశంతో పాటు త్వరలో ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై చర్చించినట్లు తెలిసింది.

ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులతో పాటు అభ్యర్థుల జాబితాపై నేడు స్పష్టమైన ప్రకటన వెలువడవచ్చని సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…