కాకినాడలో కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు.. ప్రజలకు పలు సూచనలు..
కాకినాడలో రాబోయే పార్లమెంటరీ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోకవాతు నిర్వహించారు. పోలింగ్ సెంటర్లుపై ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలను ఏరియాలపై అవగాహన పెంచుతున్నారు.
కాకినాడలో రాబోయే పార్లమెంటరీ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోకవాతు నిర్వహించారు. పోలింగ్ సెంటర్లుపై ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలను ఏరియాలపై అవగాహన పెంచుతున్నారు. ప్రజలకు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టారు. ప్రజల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపి ధైర్యంగా ఓటు వినియోగించుకునే విధంగా కవాతు నిర్వహించారు.
పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎవరైనా ధిక్కరించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్ సమయంలో పలు కేసులకు పాల్పడిన వారిపై నిఘా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు అర్హులుకారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు , ట్రాఫిక్ సీఐలు సీఐఎస్ఎఫ్ బలగాలు, ఎస్సై లు, ట్రాఫిక్ ఎస్సై లు, లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..