AP Schools: షెడ్యూల్ కంటే ముందు.! ఏపీలో హాఫ్ డే స్కూల్స్ మొదలయ్యేది ఆ రోజునే.?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడి భగభగలకు జనాలు ఠారెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య సమయంలో అడుగు బయట పెట్టాలంటే.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

AP Schools: షెడ్యూల్ కంటే ముందు.! ఏపీలో హాఫ్ డే స్కూల్స్ మొదలయ్యేది ఆ రోజునే.?
Ap Schools
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 07, 2024 | 12:55 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడి భగభగలకు జనాలు ఠారెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య సమయంలో అడుగు బయట పెట్టాలంటే.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక వైద్యులు అయితే.. ఎండవేళ బయట తిరిగేవారు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు ఈ రేంజ్‌లో ఉంటే.. మే నెల వచ్చేసరికి భానుడు నిప్పులు కక్కుతాడని అభిప్రాయపడుతున్నారు అధికారులు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రకటించింది. మరి ఏపీలో ఒంటిపూట బడుల సంగతి ఏంటి.? దానిపై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూల్స్‌కు మార్చి 11 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రకటించాలని ఎస్టీయూ డిమాండ్ చేస్తోంది. ఎండలు మండిపోతున్న తరుణంలో విద్యార్ధులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని.. అందుకే హాఫ్ డే స్కూల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కీలక ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు మార్చి 18 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటం.. పరీక్షా సెంటర్లుగా ఎంపిక చేసిన స్కూల్స్‌కి మధ్యాహ్నం వేళ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా స్కూల్స్‌లో ముందుగా విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం పెట్టి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించానున్నారట. ఇక ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత.. యధావిధిగా ఉదయం పూట తరగతులు నిర్వహిస్తారని సమాచారం. కాగా, ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడులపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.