Indian Railway: ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా..? కన్ఫర్మేషన్ కోసం నో వెయిటింగ్.. రైల్వేశాఖ గుడ్‌న్యూస్
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు టికెట్ బుక్ అవుతుందా..? లేదా? అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయ్యాక టికెట్ కన్పామ్ అవ్వకపోతే చాలామంది ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు దానికి చెక్ పడింది.

ఇటీవల ప్రయాణికులకు ఊరట కలిగించేలా రైల్వేశాఖ అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రిజర్వేషన్, తత్కాల్ టికెట్లు, లగేజీ, ట్రైన్‌లో ఫుడ్ సేవలకు సంబంధించి అనేక నూతన మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రయాణికులకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ అందించింది. ట్రైన్ టికెట్ల రిజర్వేషన్ చార్ట్ ప్రకటన సమయంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు రిజర్వేషన్ కన్ఫర్మేషన్ చార్ట్‌ను రైలు ప్రయాణించడానికి 4 గంటల ముందు ప్రకటించేవారు. కానీ ఇప్పుడు రైలు ప్రయాణం సమయానికి 10 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ రీలీజ్ చేయనున్నారు. దీని వల్ల వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ కన్పామ్ కాని ప్రయాణికులు వేరే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవచ్చు.
చార్ట్ రిలీజ్ టైమింగ్స్
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయల్దేరే రైళ్ల చార్ట్‌ను ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా విడుదల చేశారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల మధ్య బయల్దేరే ట్రైన్స్ తొలి చార్ట్‌ను 10 గంటల ముందే రూపొందించనున్నారు. దీని వల్ల వెయిటింగ్ లిస్టులో ఉండే ప్రయాణికులు టికెట్ కన్పామ్ అవ్వకపోతే 10 గంటల ముందే తెలుస్తుంది కనుక ఇబ్బంది ఉండదు.
ఐఆర్‌సీటీసీ వ్యాలెట్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా..?
ఇక టికెట్లు బుక్ చేసుకోవడానికి చాలామంది ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌లో డబ్బులు ఉంచుకుంటారు. వీటిని విత్ డ్రా చేసుకోవచ్చని కొంతమంది అనుకుంటారు. దీనిపై తాజాగా లోక్‌సభలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. కేవలం వ్యాలెట్లలోని నగదును టికెట్లు బుక్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చని, మధ్యలో విత్ డ్రా చేసుకోవడం కుదరదని అన్నారు. ఐఆర్‌సీటీసీ అకౌంట్ పూర్తిగా క్లో్జ్ చేసినప్పుడు మాత్రమే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ అవుతాయన్నారు. ప్రీపెయిండ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంటస్‌పై ఆర్బీఐ విడుదల చేసిన నిబంధనలు విత్ డ్రాకు అనుమతించవని స్పష్టం చేశారు.




