Pawan Kalyan: పవన్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన.. ఇంతకీ, పవన్‌కు ఏమైంది?

పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. పవన్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చింది. పవన్‌ అనారోగ్యం కారణంగా లీడర్లకు, కేడర్‌కు అనేక సూచనలు చేసింది పార్టీ. జనసేన ప్రకటనతో పవన్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ, పవన్‌కు ఏమైంది?. ఆయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు. లీడర్లు, కేడర్‌కు జనసేన పార్టీ చేసిన సూచనలేంటి..?

Pawan Kalyan: పవన్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన.. ఇంతకీ, పవన్‌కు ఏమైంది?
Pawan Kalyan Health
Follow us

|

Updated on: Apr 20, 2024 | 9:45 PM

పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. పవన్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చింది. పవన్‌ అనారోగ్యం కారణంగా లీడర్లకు, కేడర్‌కు అనేక సూచనలు చేసింది పార్టీ. జనసేన ప్రకటనతో పవన్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ, పవన్‌కు ఏమైంది?. ఆయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు. లీడర్లు, కేడర్‌కు జనసేన పార్టీ చేసిన సూచనలేంటి..?

గజమాలలు వెయ్యొద్దు… ముఖంపై పూలు చల్లొద్దు.. ఫొటోల కోసం ఒత్తిడి చెయ్యొ్ద్దు.. సెల్ఫీలు, షేక్‌ హ్యాండ్‌లు వద్దే వద్దు! ఇవన్నీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోసం ఆ పార్టీ జారీ చేసిన హెచ్చరికలు. జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ నోట్‌ రిలీజ్‌ చేసింది మంగళగిరి పార్టీ ఆఫీస్‌.

కాకినాడ జిల్లా ఉప్పాడ పర్యటనలో పవన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు ఫ్యాన్స్‌. ఎంతలా అంటే, పవన్‌కు ఊపిరిసలపనంతగా!. ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన అభిమానులు, పవన్‌కు ఊపిరాడకుండా చేశారు. పవన్‌ మాట్లాడుతుండగానే సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఫొటోలు దిగేందుకు పోటీపడ్డ ఫ్యాన్స్‌, ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగారు. దాంతో, వేదికపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానుల్ని కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేశారు నిర్వాహకులు. పవన్‌ బౌన్సర్లు అలర్టై… ఫ్యాన్స్‌ను పక్కకు లాగిపడేశారు. అయినా, పరిస్థితి కంట్రోల్‌లోకి రాకపోవడంతో పోలీసులు సీన్‌లోకి రావాల్సి వచ్చింది. ఇక, అభిమానులను తప్పించుకుని వేదిక నుంచి దిగబోయిన పవన్‌ కల్యాణ్‌, తోపులాటతో కిందపడబోయారు. అయితే, పవన్‌ కిందపడకుండా కాపాడారు ఆయన బౌన్సర్లు.

ఉప్పాడ ఇన్సిడెంట్‌ జరిగిన కాసేపటికే మంగళగిరి జనసేన ఆఫీస్‌ నుంచి ప్రకటన విడుదలైంది. పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం బాలేదంటూ బాంబు పేల్చింది పార్టీ. రికరెంట్‌ ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడుతున్నారని, ఆయన ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందంటూ పవన్‌ హెల్త్‌ ఇష్యూని బయటపెట్టింది. పవన్‌ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని, పిఠాపురం టూర్‌లో హైఫీవర్‌ వచ్చిందంటూ తెలియజేసింది. ఇప్పటికీ పవన్‌ అస్వస్థతతో బాధపడుతున్నారని, ప్రతిరోజూ ఏదోఒక సమయంలో జ్వరం వస్తున్నట్లు ఆ నోట్‌లో వెల్లడించింది. అందుకే, పవన్‌ పర్యటనల్లో అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు… జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసింది. జనసేన పార్టీ రిలీజ్‌ చేసిన ఈ ప్రకటన కేడర్‌కి షాక్‌కి గురిచేసింది.

పవన్‌ ఎక్కడకెళ్లినా జనం పోటెత్తుతారు. పవన్‌ను ముట్టుకోవాలని, ఆయనతో చేయి కలపాలని, సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. అత్యుత్సాహంతో వచ్చి మీదపడిపోతుంటారు, పవన్‌ను కిందపడేస్తుంటారు. అందుకే, ప్రోటోకాల్‌ పాటించాలంటూ జనసేన కేడర్‌కు ఎన్నోసార్లు స్వయంగా విజ్ఞప్తి చేశారు పవన్‌. అంతేకాదు, ఫ్యాన్స్‌ ముసుగులో ప్రత్యర్థులు దాడులకు తెగబడుతున్నారంటూ కాకినాడ టూర్‌లో సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. తనపై, తన సెక్యూరిటీపై బ్లేడ్లతో దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకే, స్ట్రిక్ట్‌గా ప్రోటోకాల్‌ పాటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఉప్పాడ ఇన్సిడెంట్‌ జరగడంతో సీరియస్‌గా తీసుకుంది జనసేన పార్టీ. పవన్‌ ఆరోగ్యం, సెక్యూరిటీ కోసం మరిన్ని జాగ్రత్తలు చేపట్టింది. పవన్‌కు గజమాలలు వెయ్యొద్దు, ముఖంపై పూలు చల్లొద్దు, ఫొటోలు సెల్ఫీల కోసం ఒత్తిడి చెయ్యొద్దు, షేక్‌ హ్యాండ్‌లు ఇవ్వొద్దంటూ సూచించింది. మరి, జనసేన కేడర్‌ వీటిని పాటిస్తారో లేదో చూడాలి!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…