AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ అగ్ని ప్రమాదం అంటూ ప్రచారం.. అసలు విషయం తెలిసి హమ్మయ్య అన్న జనాలు.. ఇంతకు ఏం జరిగింది!

విశాఖ పారిశ్రామిక ప్రాంతం.. హెచ్ పీ సి ఎల్ రిఫైనరీ చిమ్నీ నుంచి భారీగా ఎగసి పడుతున్న మంటలు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కటే కలవరం.. ఏదో జరిగిపోతుందని ఆందోళన.. ఈలోగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్ట్‌లు.. ఈ పోస్ట్‌లు వైరల్‌గా మారడంతో జనాల్లో మరింత ఆందోళన. ఎందుకంటే హెచ్పిసిఎల్ లో గతంలో జరిగిన ఘటనలు, పరిణామాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీరా అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

భారీ అగ్ని ప్రమాదం అంటూ ప్రచారం.. అసలు విషయం తెలిసి హమ్మయ్య అన్న జనాలు.. ఇంతకు ఏం జరిగింది!
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: Anand T|

Updated on: Oct 30, 2025 | 10:00 PM

Share

విశాఖ పారిపారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్ పీ సి ఎల్ రిఫైనరీకి చెందిన చిమ్ని నుంచి సాధారణంగా నిత్యం మంట వస్తూ ఉంటుంది. చమురు శుద్ధి కేంద్రాల్లో.. చిమ్ని నుంచి మంటలు రావడం అనేది సహజం. వ్యర్థ పదార్థాలన్నీ ఇలా మండిపోతు ధ్వంసం అవుతూ ఉంటాయి. దానివల్ల సంస్థకు గాని జనాలు కానీ ఎటువంటి నష్టం ఉండదు. అది సంస్థ కార్యకలాపాల్లో ఒక భాగం. విశాఖలోనూ హెచ్పీసీఎల్ చిమ్ని నుంచి నిత్యం మంటలు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. కానీ.. ఆ మంటలు కాస్త పెరిగాయి. అది కాస్తా ఆ నోటా ఈ నోటా పాకింది. పరిసర ప్రజలంతా ఆందోళన చెందారు. ఈ లోగా సోషల్ మీడియాలో వీడియోలు, మెసేజ్ వైరల్ అయింది.

ఒకవైపు తుపాను హడావుడిలో ఉన్న విశాఖ ప్రజలకు మరోసారి గుండెలు పట్టుకునే పరిస్థితి ఎదురైంది. ఏదైనా ప్రమాదం జరిగిందా అని కంగారు పడిన వాళ్ళూ లేకపోలేదు. ఈ లోగా వారందరికి మరో మెసేజ్ వచ్చింది. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రమాదమేమీ లేదని తెలిసింది. దీంతో వారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

అసలు విషయానికి వస్తే.. గత మూడు రోజులుగా వాతావరణం బాగా చల్లబడింది.. ఆ తర్వాత ఒక్కసారిగా చిమ్నీని మండించడంతో ఇలా భారీగా మంట కనిపించిందని సంస్థ కార్మికుల చెబుతున్నారు. చిమ్నీ అంతర్గతంగా ఉండే కర్బన ఉద్గారాలను మండించడం ఉత్పత్తి ప్రక్రియలో భాగమేనని.. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా ప్రభావమే ఇంత పని చేసిందని విశాఖలో జనం చర్చ మొదలైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి