AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అరుదైన జన్యువాధితో బాధపడుతున్న మహిళ.. రక్తం గడ్డ కట్టడానికి కోటిన్నర ఇంజెక్షన్లు..

అరుదైన జన్యు వ్యాధితో బాధపడే నాగదుర్గకు మరో సమస్య వచ్చింది. దీంతో ఆమె గుంటూరు జిజిహెచ్ కు వచ్చింది. గత నెలలో ఆమెకు కుడివైపు అండాశయంలోని సిస్ట్ నుండి రక్తస్రావం కారడం ప్రారంభమైంది. దీంతో వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేసి సిస్ట్ తొలగించాలని నిర్ణయించారు. అయితే నాగదుర్గకు ఉన్న జన్యవ్యాధి కారణంగా రక్త స్రావం ఆగేందుకు పెద్ద ఎత్తున ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Andhra Pradesh: అరుదైన జన్యువాధితో బాధపడుతున్న మహిళ.. రక్తం గడ్డ కట్టడానికి కోటిన్నర ఇంజెక్షన్లు..
Glanzmann Thrombasthenia
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 30, 2024 | 7:46 PM

Share

గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతానికి చెందిన నాగదుర్గ జన్యు వ్యాధితో బాధపడుతుంది. గ్లాన్జ్‌మాన్ థ్రోంబాస్థెనియా అనే జన్యు వ్యాధి ఉన్న రోగుల్లో రక్త స్రావం ఆగదు. రక్తం గడ్డకట్టించేందుకు లెక్కకు మించి ఇంజక్షెన్లు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే రోగుల్లో ప్లేటు లెట్లు గ్లైకో ప్రోటీన్లను తక్కువ స్థాయిలో కలిగిఉంటాయి. దీంతో ఫ్లేట్ లెట్ల మధ్య ఫైబ్రోజెనిక్ బ్రిడ్జి త్వరగా ఏర్పడదు. దీనివలన రక్త స్రావం జరుగుతూనే ఉంటుంది.

ఇటువంటి అరుదైన జన్యు వ్యాధితో బాధపడే నాగదుర్గకు మరో సమస్య వచ్చింది. దీంతో ఆమె గుంటూరు జిజిహెచ్ కు వచ్చింది. గత నెలలో ఆమెకు కుడివైపు అండాశయంలోని సిస్ట్ నుండి రక్తస్రావం కారడం ప్రారంభమైంది. దీంతో వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేసి సిస్ట్ తొలగించాలని నిర్ణయించారు. అయితే నాగదుర్గకు ఉన్న జన్యవ్యాధి కారణంగా రక్త స్రావం ఆగేందుకు పెద్ద ఎత్తున ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మూడు వందల వరకూ ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుందని ఇందు కోసం కోటిన్నర ఖర్చువుతుందని వైద్యులు తెలిపారు. అంత పెట్టుకొనే స్థోమత లేదని నాగదుర్గ చెప్పడంతో ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే నసీర్ స్పందిస్తూ ఆమెకు వైద్యం అందించమని అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్ అరెంజ్ చేద్దామన్నారు. దీంతో జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ రంగంలోకి దిగారు. ఆయనే సర్జన్ కావడంతో స్వయంగా రంగంలోకి దిగి అత్యంత్య జాగ్రత్తగా బాధితురాలికి ఆపరేషన్ చేసి సిస్ట్ తొలగించారు. అనంతరం ఎమ్మెల్యే సాయంతో 319 ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేశారు. దీంతో ఆమెకు రక్త స్రావం తగ్గిపోయి పూర్తిగా కోలుకుంది. ఉచితంగా వైద్యం అందించిన వైద్యులకు, ఇంజక్షన్లు సమకూర్చిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు, కూటమీ ప్రభుత్వానికి ఆమె, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..