Navaratri 2024: నవరాత్రులలో ఉపవాసం ఉంటున్నారా..! ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఈ టిఫిన్స్ ట్రై చేసి చూడండి
శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024, గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అటువంటి పరిస్థితిలో దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజుల పాటు ఆరాధించడంతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలతో సహా కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. మీరు కూడా అలా అమ్మవారిని పూజిస్తూ వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోకుండా ఉండాలనుకుంటే.. ఈ తొమ్మిది రోజులు తీసుకునే కొన్ని ఉత్తమ అల్పాహారాలను తెలుసుకోండి..
దేవీ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు తొమ్మిది రోజులు పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. అంతే కాకుండా, ఉపవాసం ఉన్నవారు మాంసాహారం తినరు. మద్యపానం చేయరు. అంతేకాదు వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తినరు. శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024, గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అటువంటి పరిస్థితిలో దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజుల పాటు ఆరాధించడంతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలతో సహా కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. మీరు కూడా అలా అమ్మవారిని పూజిస్తూ వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోకుండా ఉండాలనుకుంటే.. ఈ తొమ్మిది రోజులు తీసుకునే కొన్ని ఉత్తమ అల్పాహారాలను తెలుసుకోండి..
ఆహారం రుచిని పెంచడమే కాదు.. వెల్లుల్లి, ఉల్లిపాయలు పోశాకలకు ప్రసిద్ధి చెందాయి. అందువల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక లక్షణాలను కలిగి ఉన్నాయని భావిస్తారు. అందుకే నవరాత్రి సమయంలో చాలా మంది ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలను తినరు. ఈ నేపధ్యంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా ఆరోగ్యకరమైన రుచికరమైన అల్పాహారాలు ఏమిటంటే
పోహా
అల్పాహారం గురించి మాట్లాడుతే పోహా వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చేసుకోవచ్చు. పోహాను తయారు చేయడం కూడా సులభం. ఇది దాదాపు 10 నుండి 15 నిమిషాల్లో త్వరగా తయారవుతుంది. ఇది తేలికగా జీర్ణం అవుతుంది. శనగలు, వేరుశెనగలు వేసి పోహా చేస్తే మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
ఉప్మా
ప్రజలు ఉప్మా తయారు చేయడంలో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. అయితే ఉల్లిపాయ లేకుండా ఉప్మా తినడం కూడా చాలా రుచిగా ఉంటుంది. సుజీ రవ్వను వేయించి పక్కకు పెట్టి.. బాణలిలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి, కొన్ని మసాలా దినుసులు, టమోటాలు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి, వేయించిన సుజీ రవ్వను వేసి వేడినీరు పోయాలి. ఇలా చేయడం వల్ల ఉప్మా రుచిగా, పోషకమైనదిగా మారుతుంది.
సేమ్యా ఉప్మా
వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా అల్పాహారం గురించి మాట్లాడితే సేమియా ఉప్మాను తయారు చేసుకోవచ్చు. దీని కోసం బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి బఠానీలను తీసుకోవాలి. దీనితో పాటు టమోటాను కత్తిరించండి. ఇప్పుడు టొమాటోలతో పాటు పసుపు, కారం, ఉప్పు, కట్ చేసిన కొత్తిమీర, ఉప్పు వేసి వేయించండి. అందులో బఠానీలు, బంగాళాదుంపలను వేసి రెండూ వేయించాలి. దీని తర్వాత పచ్చిమిర్చి వేసి, అవసరాన్ని బట్టి నీళ్లు పోసి ఉడికించాలి. చివరిగా వేయించిన సేమ్యా వేసి ఉడికించాలి.
ధోక్లా
వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా అల్పాహారం తీసుకోవాలంటే గుజరాత్ లో ప్రసిద్ధ డోక్లాను తయారు చేసుకోవచ్చు. అవును దీన్ని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. అయితే దీనిని తయారు చేసుకోవడానికి సరైన పద్ధతిని తెలుసుకోవాలి. దీని కోసం శనగపిండి, ఈనో, నిమ్మకాయ, పెరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు మొదలైన వస్తువులు తీసుకోవాలి. ముందుగా శెనగపిండి, పెరుగు, నీళ్లు కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసి కాసేపు పక్కన ఉంచి.. ఇప్పుడు వెడల్పాటి కుక్కర్‌లో నీళ్లు పోసి నీటిని మరిగించాలి. ఇంతలో శనగపిండి మిశ్రమంలో ఈనో పౌడర్ , నూనే, నెయ్యి వేసి బాగా కలిపి .. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి దానిని ఆవిరిపై 20 నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఢోక్లాను దింపి.. చల్లారాక ముక్కలుగా కోయాలి. కాస్త చల్లారిన తర్వాత ఈ ముక్కలను తీసి ఆవాలు, నిమ్మ, పంచదార, కరివేపాకు, పచ్చిమిర్చి మొదలైన వాటితో టెంపరింగ్ వేయాలి. డోక్లాను గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..