Bihar Floods: నేపాల్‌లో వర్షం బీహార్‌లో వరదల బీభత్సం.. కోసి నదిని బీహార్ దుఃఖం దాయని అని ఎందుకంటే అంటారంటే?
సెప్టెంబర్ 27 నుంచి నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి ఆదివారం రికార్డు స్థాయిలో 6,61,295 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గండక్ బ్యారేజీలో దాదాపు అంతే మొత్తంలో నీటిని విడుదల చేశారు. దీని కారణంగా బీహార్‌లో కోసి, గండక్ బాగ్మతి, బుద్ధి గండక్, కమల బాలన్, మహానంద, గంగా వంటి నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నదుల నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బీహార్‌లోని పలు జిల్లాలు ప్రమాదంలో పడ్డాయి. నేపాల్ లోని వరదలు, వర్షాల కారణంగా బీహార్ లో అనేక ప్రాంతాలలో భారీ నష్టం చోటు చేసుకుంది. సరిహద్దు జిల్లాల్లో చాలా చోట్ల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 1968 నుంచి ఇప్పటి వరకూ నేపాల్‌లో ఇంత భారీ వర్షాలు ఎప్పుడూ పడలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి ఆదివారం రికార్డు స్థాయిలో 6,61,295 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గండక్ బ్యారేజీలో దాదాపు అంతే మొత్తంలో నీటిని విడుదల చేశారు.
దీని కారణంగా బీహార్‌లో కోసి, గండక్ బాగ్మతి, బుద్ధి గండక్, కమల బాలన్, మహానంద, గంగా వంటి నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నదుల నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఈ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి రికార్డు స్థాయిలో నీటి విడుదలతో 13 జిల్లాల్లో 16.28 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా బీహార్ ప్రజలు వరదలతో పోరాడుతున్నారు. 1968లో కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి 7.88 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో కూడా బీహార్‌లోని పలు జిల్లాల్లో విధ్వంసం జరిగింది.
వరదలు అలెర్ట్
Flood Alert!🚨
नेपाल में भारी वर्षा के कारण आज सुबह कोसी बराज, वीरपुर से 6,61,295 क्यूसेक जलस्राव हुआ है, जो 1968 के बाद सबसे अधिक है।
बाढ़ रूपी आपदा से जान-माल की सुरक्षा के लिए जल संसाधन विभाग और जिला प्रशासन की टीमें दिन-रात तत्पर हैं। कृपया आप भी सतर्क रहें।
Kosi Barrage👇 pic.twitter.com/ub2gz4a8Xm
— Vijay Kumar Choudhary (@VijayKChy) September 29, 2024
బీహార్‌లోని వరదల్లో చిక్కుకున్నాయి 13 జిల్లాలు
ఈసారి కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నదుల (కోసి, గండక్,యు గంగా) నీరు పశ్చిమ,తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, అరారియా, సుపాల్, కతిహార్, పూర్నియా సహా అనేక ఇతర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశించింది. శనివారం ఉదయం బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో 780.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి.
బీహార్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం, బక్సర్, భోజ్‌పూర్, సరన్, పాట్నా, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్, భాగల్‌పూర్‌తో సహా గంగా ఒడ్డున ఉన్న 13 జిల్లాల్లో వరదల పరిస్థితి ఉంది.
వరదలు, వర్షాలు నేపాల్‌లో విధ్వంసం సృష్టించాయి
మరోవైపు నేపాల్‌లో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 148కి చేరింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 55 మంది గల్లంతయ్యారు. 101 మంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అనేక రహదారులు మూసుకుపోయాయి. వందలాది ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డారు. రహదారుల దిగ్బంధనంతో వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కనీసం 322 ఇళ్లు, 16 వంతెనలు దెబ్బతిన్నాయి. దాదాపు 3,626 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలను రక్షించేందుకు 20,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేపాల్‌లో వరదలు, వర్షం బీభత్సం!
బీహార్ వరదలకు నేపాల్ సంబంధం ఏమిటి?
నేపాల్‌లో వర్షం కారణంగా, బీహార్‌లోని మైదాన ప్రాంతం నేపాల్‌కు ఆనుకుని ఉన్నందున బీహార్‌లో వరదలు సంభవించాయి. కోసి, గండక్, బుధి గండక్, కమ్లా బాలన్, బాగ్మతి వంటి అనేక నదులు నేపాల్ నుండి బీహార్ వరకు ప్రవహిస్తాయి. నేపాల్‌లో వర్షాలు కురిసినప్పుడల్లా అక్కడ నదుల నీరు బీహార్‌కు రావడం ప్రారంభమవుతుంది. నేపాల్‌లోని ఏడు నదులు కోసిలో కలుస్తాయి. ఇది ప్రతి సంవత్సరం బీహార్‌లో వినాశనం కలిగిస్తుంది. అందుకే కోసిని బీహార్ దుఃఖం దాయని అని కూడా పిలుస్తారు. బీహార్‌లోని తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, మధుబని, సుపాల్, అరారియా కిషన్‌గంజ్ జిల్లాలు నేపాల్‌కు ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలు కూడా వరదల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..