- Telugu News Lifestyle Many types of health problems attack due to smoking cigarettes and tea together, Check Here is Details
Tea and Cigarette: స్టైల్‌గా సిగరెట్ కాల్చుతూ టీ తాగుతున్నారా.. మీ కొంప ముంచేస్తుంది..
స్మోక్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. ఇదే ప్రమాదం అనుకుంటే.. స్మోక్ చేస్తూ స్టైల్‌గా నిల్చుని, సంతోషంగా టీ తాగుతూ ఉంటారు. ఆ ఒక్క క్షణానికి ఎంతో కాలం నిలవదన్న విషయం ఎవరికీ తెలీదు. స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు రక్తాన్ని..
Updated on: Sep 30, 2024 | 6:47 PM

స్మోక్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. ఇదే ప్రమాదం అనుకుంటే.. స్మోక్ చేస్తూ స్టైల్‌గా నిల్చుని, సంతోషంగా టీ తాగుతూ ఉంటారు. ఆ ఒక్క క్షణానికి ఎంతో కాలం నిలవదన్న విషయం ఎవరికీ తెలీదు.

స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో సంకోచం ఏర్పడి.. రక్త

సాధారణంగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకటి, రెండు సార్లకు మించి తాగితే మాత్రం ఖచ్చితంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణ టీ కంటే పాల టీ అస్సలు మంచిది కాదు.

టీతో పాటు సిగరెట్ తాగితే.. ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం వరకు పెరుగుతాయని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీలో ఉండే టాక్సిన్స్‌ను సిగరెట్ పొగలో కలుస్తే.. అది క్యాన్సర్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు.

ఈ రెండింటి కాంబినేషన్ వల్ల సంతాన లేమి సమస్యలు, కడుపులో పుండ్లు, జీర్ణ సమస్యలు, ఊపిరి తిత్తులు కుంచించుకు పోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




