Twin Calves: ఆడ, మగ కవల ఆవు దూడలకు జన్మనిచ్చిన ఆవు, సంతోషంలో రైతు
సాధారణంగా కృత్రిమ గర్భధారణ ద్వారా ఆవులు కవల దూడలను జన్మనివ్వడం చూసి ఉంటాం. దానికి భిన్నంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక లో రైతు అబ్బాయి తన ఆవు ఎదకు రావడంతో గ్రామంలోని ఆంబోతు ( తాడిపెద్దు) తో క్రాసింగ్ చేయించాడు. దీంతో రైతు అబ్బాయి ఆవు 9 నెలల తర్వాత సోమవారం కవలదూడలకు జన్మనిచ్చింది.