AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోడి దొంగతనం గురించి పోలీసుకి క్యూట్ గా బాలుడి ఫిర్యాదు.. పోలీసులు ఏమన్నారంటే

పాకిస్థానీ బాలుడి వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ బాలుడు పోలీసు అధికారికి తన కోడి దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తున్నాడు. అప్పుడు చాలా విశ్వాసంతో కనిపించాడు. అయితే బాలుడు మాట్లాడే భాష.. పోలీస్ అధికారికి వివరించిన తీరు నెటిజన్లకు బాగా నచ్చుతోంది.

Viral Video: కోడి దొంగతనం గురించి పోలీసుకి క్యూట్ గా బాలుడి ఫిర్యాదు.. పోలీసులు ఏమన్నారంటే
Pakistani Boy Video
Surya Kala
|

Updated on: Sep 30, 2024 | 7:39 PM

Share

పిల్లలు దైవంతో సమానం అని పెద్దలు అంటారు. అమాయకత్వం తో చిన్నారులు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తారు. ప్రస్తుతం తన అమాయకత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న పాకిస్థానీ బాలుడి వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ బాలుడు పోలీసు అధికారికి తన కోడి దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తున్నాడు. అప్పుడు చాలా విశ్వాసంతో కనిపించాడు. అయితే బాలుడు మాట్లాడే భాష.. పోలీస్ అధికారికి వివరించిన తీరు నెటిజన్లకు బాగా నచ్చుతోంది.

ఈ ఆసక్తికర ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. వైరల్ క్లిప్‌లో పిల్లవాడు, పోలీసు అధికారి స్థానిక భాషలో మాట్లాడుతున్నట్లు చూడవచ్చు. స్కూల్ యూనిఫాం ధరించిన ఓ చిన్నారి తన కోళ్లు దొంగిలించబడ్డాయని మొబైల్ వ్యాన్‌లో కూర్చున్న ఓ పోలీసు అధికారికి ఫిర్యాదు చేయడం వీడియోలో కనిపిస్తుంది. ఆ చిన్నారి ఇదంతా చాలా అమాయకంగా చెప్పడంతో పోలీసు అధికారి తనను తాను కంట్రోల్ చేసుకోలేక తన మొబైల్‌లో ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది?’

ఇవి కూడా చదవండి

అనుమానితుడిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయమని అధికారి చిన్నారిని కోరుతున్నాడు. ఈ విషయం గురించి చిన్నారి బాలుడు అమాయకంగా అడుగుతున్నాడు. ఫిర్యాదు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అని అడిగిన బాలుడికి ఈ ప్రక్రియ మొత్తం ఉచితం అని అధికారి హామీ ఇచ్చారు.

పాకిస్తానీ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో ఇక్కడ చూడండి

ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. చాలా మంది నెటిజన్లు బాలుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సహాయం కోసం నమ్మకంగా పోలీసులను సంప్రదించాడు. అంతే కాకుండా చిన్నారి అమాయకత్వం దొంగిలించబడిన కోడి గురించి ఆందోళన చెందడం కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.

చాలా మంది వినియోగదారులు పంజాబ్ పోలీసులను ట్యాగ్ చేశారు. అనుమానితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని .. కోడిని తిరిగి యజమానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా చాలా ఓపికగా దయతో పరిస్థితిని చక్కదిద్దిన పోలీసు అధికారిని కూడా ప్రజలు కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..