AP News: ’14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు’.. పేర్ని నాని సూటి ప్రశ్న..

తనను బూతుల నాని అని చంద్రబాబు విమర్శిస్తున్నారంటూ పేర్ని నాని అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తాను పవన్‌ని, బాబుని ఎప్పుడైనా బూతులు తిట్టానా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీరే సీఎం జగన్‌ని ఇష్టమొచ్చినట్లు, పచ్చిగా తిడతారని టీడీపీ, జనసేన అధినేతలను ఉద్దేశించి అన్నారు.

AP News: '14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని సూటి ప్రశ్న..
Perni Nani
Follow us
Srikar T

|

Updated on: Apr 18, 2024 | 5:32 PM

తనను బూతుల నాని అని చంద్రబాబు విమర్శిస్తున్నారంటూ పేర్ని నాని అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తాను పవన్‌ని, బాబుని ఎప్పుడైనా బూతులు తిట్టానా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీరే సీఎం జగన్‌ని ఇష్టమొచ్చినట్లు, పచ్చిగా తిడతారని టీడీపీ, జనసేన అధినేతలను ఉద్దేశించి అన్నారు. వయసు పెరిగింది గానీ, ఏ మాట్లాడాలో బాబుకి తెలియదంటూ చురకలు అంటించారు. మీ తీరుని ప్రశ్నిస్తే తాను బూతుల నానినా అని ప్రశ్నించారు. తన కొడుకు కృష్ణమూర్తిపై గంజాయి నిందలు మోపుతారా అని మండిపడ్డారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో తన కుమారుడు ప్రజలకు సేవ చేశాడని చెప్పారు. చంద్రబాబు విషపు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందరుకు ఏం చేశారని అడిగారు. బందరుకు పూర్వవైభవం రావడానికి కారణం పేర్ని నాని అని కితాబిచ్చారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామని తెలిపారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. బాబు హయాంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు బందరుకు జిల్లా కలెక్టర్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అలాంటిది కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చి బందరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తీసుకొచ్చి పూర్వవైభవం తెచ్చింది వైఎస్ జగన్ అని కీర్తించారు. సీఎం జగన్ ఎప్పుడూ చంద్రబాబు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదని.. కావాలంటే బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. కేవలం రాజకీయ పరంగా, విధాన పరమైన నిర్ణయాల్లో విమర్శించారే తప్ప వ్యక్తిత్వ హననం చేయలేదని చెప్పారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం తనకు ఉందని తెలిపారు. దశాబ్దాలుగా కాదు శతాబ్ధాలుగా మచిలీపట్నం వైభవానికి ఉన్న మసకను తొలగింది కేవలం సీఎం జగన్ అని దమ్ముగా చెప్పగలనన్నారు.

పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..