Prakasam: ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు.. అట్ట పెట్టెలు ఓపెన్ చేయగా.. అసలు ట్విస్ట్ ఇదే

ప్రకాశం జిల్లాలో ఈ సీన్ వెలుగుచూసింది. దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం షాపు నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ శ్రీరామ్‌ కొండయ్యను అదుపులోకి తీసుకొని ఆరా తీయగా..

Prakasam: ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు.. అట్ట పెట్టెలు ఓపెన్ చేయగా.. అసలు ట్విస్ట్ ఇదే
Liquor Dump
Follow us

|

Updated on: Apr 18, 2024 | 3:47 PM

ప్రజంట్ దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికారులు.. వాహనాలను మాత్రమే కాదు. చెట్టు, పుట్ట, రాయి, రప్పా ఏదీ వదలడం లేదు. ఎన్నికల్లో డబ్బుతో పాటు మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాల ప్రభావాన్ని నిరోధించేందుకు శక్తికి మించి పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో చేపట్టిన తనిఖీల్లో.. ప్రకాశం జిల్లాలో అక్రమంగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని గవర్నమెంట్ మద్యం షాపు నుంచి కారులోకి మద్యం కేసులు డంప్ చేస్తుండగా..  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ శ్రీరామ్‌ కొండయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా.. మండలంలోని పెదఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఈరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా 223 లిక్కర్ కేసులు బయటపడ్డాయి.

ముండ్లమూరు, పెదఉల్లగల్లు, మారెళ్ల గ్రామాల్లోని గవర్నమెంట్ లిక్కర్ షాపుల నుంచి ఈ మద్యాన్ని నిందితులు సేకరించారు. ఈ స్కెచ్‌కు సూత్రధారిగా భావిస్తున్న మేడం రమణారెడ్డి, లిక్కర్ నిల్వ చేసిన మాలకొండారెడ్డి, మద్యం రవాణా చేసేందుకు యత్నించిన డ్రైవర్‌ కొండయ్య, వీరికి సహకరించిన చిన్నబాల అనే వ్యక్తి, మూడు షాపుల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు గండి జక్రయ్య, షేక్‌ అంజిబాబు, గోపిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు ఆరుగురు సేల్స్‌మన్‌పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌సునీల్‌ వెల్లడించారు. రమణారెడ్డి, అంజిబాబులు తప్ప మిగిలిన వారిని అరెస్టు చేశామన్నారు. 11,825 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.20.63 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు.

ప్రభుత్వం అక్రమ నిల్వ, సరఫరాపై సీరియస్‌గా ఉందని.. పైగా ఎన్నికల సీజన్ నడుస్తుందని… ఎవరు తప్పుడు పనులు చేసినా కఠిన సెక్షన్లు పెట్టి లోపల వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..