AP Weather: మండే ఎండల్లో చల్లటి వార్త.. ఆంధ్రాలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్రాలో డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు దంచి కొట్టిన ఎండలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడగా.. మరికొన్ని జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. మరోసారి కూల్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్.. ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసింది.
మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఇప్పుడు కొమొరిన్ ప్రాంతం నుండి దక్షిణ తెలంగాణకు, అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0 .9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాబోవు మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
———————————— గురువారం, శుక్రవారం :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 -40 కి.మీ .వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
గురువారం :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
శుక్రవారం :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 -40 కి.మీ .వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది వేడి ,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
రాయలసీమ :-
——————- గురువారం, శుక్రవారం :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి రాత్రులు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది.
శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 -40 కి.మీ .వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది వేడి ,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.