YS Jagan: నేనున్నా భయపడకండి.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిసిన జగన్.. సాయం చేయాలని కోరగా..

జననాయకుడికి అడుగడుగునా జన నీరాజనం.. మండుటెండను సైతం లెక్క చేయకుండా అపూర్వ స్వాగతం లభిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు కూడా విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కడియపులంకకు సీఎం జగన్ యాత్ర చేరుకుంది. ఉదయం తేతలి దగ్గర మొదలైన యాత్ర.. తణుకు, రావులపాలెం మీదుగా కొనసాగుతోంది.

YS Jagan: నేనున్నా భయపడకండి.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిసిన జగన్.. సాయం చేయాలని కోరగా..
Ys Jagan
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:46 PM

జననాయకుడికి అడుగడుగునా జన నీరాజనం.. మండుటెండను సైతం లెక్క చేయకుండా అపూర్వ స్వాగతం లభిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు కూడా విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కడియపులంకకు సీఎం జగన్ యాత్ర చేరుకుంది. ఉదయం తేతలి దగ్గర మొదలైన యాత్ర.. తణుకు, రావులపాలెం మీదుగా కొనసాగుతోంది. రావులపాలెంలో సీఎం జగన్‌కు అమితాదరణ లభించింది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు బస్‌ యాత్రలో పాల్గొన్నారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. తండోపతండాలుగా తరలివస్తున్న అభిమానులను పలకరిస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలో మడికి గ్రామంలో అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌ను సీఎం జగన్ కలిశారు. సహాయం కావాలని సీఎంని ఆ పేషెంట్ బంధువులు కోరారు. అవసరమైన సహాయం అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని.. మరింత సహాయం కావాలని బాధితులు సీఎంను కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించి సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

జగన్ వీడియో చూడండి..

కాసేపట్లో మోరంపూడి జంక్షన్ దగ్గరకు సీఎం జగన్ యాత్ర చేరుకుంటుంది. తాడితోట జంక్షన్, రాజానగరం మీదుగా ఈ యాత్ర రాత్రికి ST రాజపురం చేరుతుంది.

రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్‌ వెంట అభిమానులు ప్రయాణం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..