ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే.. వచ్చే మూడు రోజులు బయటకు రాకపోవడమే బెటర్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి గాలుల వల్ల ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలకు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పట్టపగలు రోడ్లన్నీ నిర్మాణుశ్యంగా మారిపోతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. రానున్న రెండు, మూడ్రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.

ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే.. వచ్చే మూడు రోజులు బయటకు రాకపోవడమే బెటర్..
Heat Wave
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2024 | 9:50 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి గాలుల వల్ల ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలకు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పట్టపగలు రోడ్లన్నీ నిర్మాణుశ్యంగా మారిపోతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. రానున్న రెండు, మూడ్రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. అవసరముంటేనే బయటకు రావాలంటూ తెలుగు రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

ఏపీలో రేపు నుంచి ఉష్ణోగ్రత మరింత పెరగనున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే పలు జిల్లాలో పెద్ద ఎత్తున వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వేడిగాలులు వీస్తుండగా.. ఉత్తరాంధ్రలో వాటి తీవ్రత మరింత పెరిగింది. నంద్యాల జిల్లాలో 44, విజయనగరం జిల్లా తుమ్మకపల్లిలో 43.5, శ్రీకాకుళం జిల్లా అముదాలవలస లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శుక్రవారం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు వీలైనంత వరకు 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లో ఉండాలని.. తప్పని సరి పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగింది. బుధవారం ఏడు జిల్లాలో ఉష్ణోగ్రతలు సుమారు 43 డిగ్రీల సెల్సియస్ కు పైగా నమోదు అయ్యాయి. గరిష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్ లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటిపూట 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు వరకు నమోదు అయ్యాయి. రానున్న రెండు, మూడు రోజులు చాలా అలర్ట్ గా ఉండాలని.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐఎండీ హెచ్చరిస్తుంది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. డీ హైడ్రేట్ కాకుండా మజ్జిగతో పాటు చల్లనీ పానీయాలు తీసుకోవాలని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..