Hyderabad: ఆదివారం హైదరాబాద్‌లో మటన్ షాపులు బంద్
మాంస ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అవును... ఆదివారం వచ్చిందంటే మాంసప్రియులకు పండగే. చికెన్, మటన్, ఫిస్.. వారికి ఇష్టం వచ్చిన ఆహారం కోసం షాపుల ముందు క్యూ కడతారు. సాధారణంగా ఆదివారం పూట చాలా ఇళ్లల్లో మాంసం వంటకాల గుమగుమలు గుబాళిస్తుంటాయి. సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ మాత్రమే అనేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే, ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం తినడం కుదరదు.
మాంస ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అవును… ఆదివారం వచ్చిందంటే మాంసప్రియులకు పండగే. చికెన్, మటన్, ఫిస్.. వారికి ఇష్టం వచ్చిన ఆహారం కోసం షాపుల ముందు క్యూ కడతారు. సాధారణంగా ఆదివారం పూట చాలా ఇళ్లల్లో మాంసం వంటకాల గుమగుమలు గుబాళిస్తుంటాయి. సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ మాత్రమే అనేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే, ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం తినడం కుదరదు. ఎందుకంటే.. ఈ నెల 21న సిటీలోని అన్ని కబేళాలతో పాటు మాంసం దుకాణాలు క్లోజ్ చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జైనులు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ నేపథ్యంలోనే మహావీరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
బుల్లెట్ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు