పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..

పాలపుంతలో ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టని అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ ను తాజాగా ఖగోళ శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈ కృష్ణ బిలం ద్రవ్య రాశి సూర్యుడికన్నా ఏకంగా 33 రెట్లు పెద్దగా ఉంది. దీనికి గయా బీహెచ్-3 అని పేరు పెట్టారు. ఇది భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో గరుడ నక్షత్ర మండలంలో ఉందట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తుండగా అనుకోకుండా ఈ బ్లాక్ హోల్ ను […]

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..

|

Updated on: Apr 18, 2024 | 6:19 PM

పాలపుంతలో ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టని అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ ను తాజాగా ఖగోళ శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈ కృష్ణ బిలం ద్రవ్య రాశి సూర్యుడికన్నా ఏకంగా 33 రెట్లు పెద్దగా ఉంది. దీనికి గయా బీహెచ్-3 అని పేరు పెట్టారు. ఇది భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో గరుడ నక్షత్ర మండలంలో ఉందట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తుండగా అనుకోకుండా ఈ బ్లాక్ హోల్ ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకుడు పాస్కల్ పనుజ్జో ఓ ప్రముఖ వార్తాసంస్థకు తెలిపారు. గయా మిషన్ అనేది పాలపుంతలో ఎక్కడెక్కడ ఎలాంటి నక్షత్రాలు ఉన్నయో గుర్తించే ప్రాజెక్టు. ఆకాశంలోని నక్షత్రాల కచ్చితమైన స్థానం, పరిభ్రమణాన్ని తెలియజేసే గయా టెలిస్కోప్ ద్వారా పరిశోధకులు గయా బీహెచ్-3ని గుర్తించారు. మన పాలపుంతలో ఇప్పటికే ఉన్న స్టెల్లార్ బ్లాక్ హోల్స్ కన్నా గయా బీహెచ్-3 కృష్ణ బిలం ద్రవ్యరాశి చాలా పెద్దదని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. పక్కనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు గుర్తింపునకు నోచుకోని అధిక ద్రవ్యరాశి గల బ్లాక్ హోల్ ను గుర్తిస్తామని తాము ఊహించలేదని.. పనుజ్జో ఓ ప్రకటనలో చెప్పారు. అస్థిరంగా కదులుతున్న ఓ నక్షత్రాన్ని గుర్తించే క్రమంలో దాని పక్కనే ఉన్న బ్లాక్ హోల్ బయటపడిందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!

CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు

బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు

Follow us
Latest Articles