ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!

టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషపడాలా? ఉద్యోగాలు ఊడిపోతున్నందుకు ఏడవాలా అర్థం కాకుండా ఉంది ఉద్యోగుల పరిస్థితి. ఏఐ పుణ్యమా అని అంతర్జాతీయ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఉద్యోగం కోల్పోయి కొందరు ఏడుస్తుంటే.. ఉన్నవాళ్లు మరో సమస్యతో నెత్తిబాదుకుంటున్నారు. డ్రై ప్రమోషన్‌ ఉద్యోగులపాలిట శాపంగా మారింది. రంగం ఏదైనా .. ఉద్యోగమేదైనా సరే.. ప్రమోషన్ అందుకోవడం ఉద్యోగుల లక్ష్యం.

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!

|

Updated on: Apr 18, 2024 | 6:16 PM

టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషపడాలా? ఉద్యోగాలు ఊడిపోతున్నందుకు ఏడవాలా అర్థం కాకుండా ఉంది ఉద్యోగుల పరిస్థితి. ఏఐ పుణ్యమా అని అంతర్జాతీయ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఉద్యోగం కోల్పోయి కొందరు ఏడుస్తుంటే.. ఉన్నవాళ్లు మరో సమస్యతో నెత్తిబాదుకుంటున్నారు. డ్రై ప్రమోషన్‌ ఉద్యోగులపాలిట శాపంగా మారింది. రంగం ఏదైనా .. ఉద్యోగమేదైనా సరే.. ప్రమోషన్ అందుకోవడం ఉద్యోగుల లక్ష్యం. ప్రమోషన్ తో ఉద్యోగి హోదాతోపాటు శాలరీ కూడా పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణం. కానీ ఈ మధ్య కొత్తగా డ్రై ప్రమోషన్ ట్రెండ్ పెరిగిందని కార్పోరేట్ వర్గాలు చెప్తున్నాయి. అసలే కృత్రిమ మేధ దెబ్బకు ఉద్యోగాలపై ప్రభావం పడుతున్న సమయంలో ఇది మరో తలనొప్పిగా మారుతోందని అంటున్నాయి. డ్రై ప్రమోషన్‌ .. పేరుకు తగ్గట్టుగానే ప్రమోషన్ వస్తుంది కానీ.. ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య చాలా కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినా.. జీతాలు మాత్రం పాత స్థాయిలోనే ఉంటున్నాయి. అంతర్జాతీయ కంపెన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పెర్ల్ మేయర్ ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కంపెనీలు సుమారు 13 శాతం మంది ఉద్యోగులకు ఇలా డ్రై ప్రమోషన్లు ఇస్తున్నట్టుగా తేలింది. కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో తొలగించిన, మానేసిన ఉద్యోగుల స్థానంలో వారికంటే కింది స్థాయిలో కాస్త మెరిట్ ఉన్న వారికి ప్రమోషన్లు ఇస్తున్నాయి. కానీ పెరిగిన హోదాకు తగినట్టుగా వేతనాలు పెంచడం లేదని అధ్యయనంలో తేలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు

బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు

Follow us
Latest Articles
ట్రైన్‌కి జీవిత కాలం ఎంతో తెలుసా? ఆ తర్వాత వాటిని ఎం చేస్తారంటే..
ట్రైన్‌కి జీవిత కాలం ఎంతో తెలుసా? ఆ తర్వాత వాటిని ఎం చేస్తారంటే..
30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..
30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్