Flight Ticket: కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఓ వ్యక్తి విమానం ఎక్కాలంటే తక్కువలో తక్కువ 1000 రూపాయలైనా ఛార్జ్ ఉంటుంది. అందుకే పేద ప్రజలు విమాన ప్రయాణాల జోలికి వెళ్లరు. అయితే అందరికీ విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ (UDAN) అనే అద్భుతమైన స్కీమ్ అమలు చేస్తూ వస్తోంది. ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడంతో పాటు..
ఓ వ్యక్తి విమానం ఎక్కాలంటే తక్కువలో తక్కువ 1000 రూపాయలైనా ఛార్జ్ ఉంటుంది. అందుకే పేద ప్రజలు విమాన ప్రయాణాల జోలికి వెళ్లరు. అయితే అందరికీ విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ (UDAN) అనే అద్భుతమైన స్కీమ్ అమలు చేస్తూ వస్తోంది. ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడంతో పాటు సాధారణ ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసేలా ఈ పథకం రూపొందించారు. ఈ ఉడాన్ పథకాన్ని 2016 అక్టోబర్ 21 వ తేదీన అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల దేశంలోని పలు నగరాలకు విమాన టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్- ఆర్‌సీఎస్‌లలో చేరే విమానయాన సంస్థలు 50 నిమిషాలలోపు ప్రయాణం పూర్తయ్యే రూట్లలో టికెట్ల ధరలను చాలా తగ్గించారు.
UDAN కింద ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.ఈ క్రమంలోనే అలయన్స్ ఎయిర్‌లైన్స్ రూ.150 లకే విమాన టికెట్ అందిస్తోంది. అస్సాంలోని లీలాబరి నుంచి తేజ్‌పూర్ నగరాల మధ్య అలయన్స్ ఎయిర్‌లైన్స్ కేవలం రూ.150కే విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రయాణ దూరం 186 కిలోమీటర్లు. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి