Indian Railways: కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

Indian Railways: కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

Subhash Goud

|

Updated on: Apr 18, 2024 | 6:57 PM

ట్రైన్‌ జర్నీలో సాధారణంగా బెర్త్‌ బుక్‌ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్‌ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌..

ట్రైన్‌ జర్నీలో సాధారణంగా బెర్త్‌ బుక్‌ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్‌ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను (UTS) యాప్‌ను ప్రారంభించింది. ఒకప్పుడు తక్కువ దూరం ప్రయాణం, క్విక్‌ బుకింగ్‌, ప్లాట్‌ఫాం టికెట్‌, సీజన్‌ టికెట్‌, క్యూఆర్‌ బుకింగ్‌ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌.. ఇప్పుడు నాన్‌-సబర్బన్‌ ట్రావెల్‌ (non-suburban travel) టికెట్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటునూ అందిస్తోంది. అంటే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణానికి కూడా మూడు రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చన్నమాట. 200 కి.మీ. కంటే తక్కువ దూరం ఉంటే ప్రయాణం రోజే టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి రైల్వే స్టేషన్‌లో ఈ టికెట్‌ తీసుకునేందుకు కౌంటర్‌ వద్దకు వెళ్లకుండా ఎలా బుక్‌ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.