బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు

వేగానికి మారుపేరు బుల్లెట్‌ ట్రైన్‌. దీనికి ఆలస్యం అంటే ఏంటో తెలీదు. ప్రయాణికులను నిమిషాల్లో గమ్యానికి చేర్చడమే దీని పని. అలాంటి బుల్లెట్‌ ట్రైన్‌ ఆలస్యం కావడం అంటే చాలా రేర్‌. అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుండే జపాన్ లో వేగానికి మారుపేరైన బుల్లెట్ రైళ్లు ఆలస్యం కావడం అరుదే. అందులోనూ రైళ్లలో పాముల బెడద వల్ల ఆలస్యం కావడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా ఎదురైంది. నగోయా నుంచి టోక్యో వెళ్లే బుల్లెట్ రైల్లో మంగళవారం సాయంత్రం ఓ పాము ప్రవేశించడం ప్రయాణికుల్లో కలకలం రేపింది.

బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు

|

Updated on: Apr 18, 2024 | 6:13 PM

వేగానికి మారుపేరు బుల్లెట్‌ ట్రైన్‌. దీనికి ఆలస్యం అంటే ఏంటో తెలీదు. ప్రయాణికులను నిమిషాల్లో గమ్యానికి చేర్చడమే దీని పని. అలాంటి బుల్లెట్‌ ట్రైన్‌ ఆలస్యం కావడం అంటే చాలా రేర్‌. అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుండే జపాన్ లో వేగానికి మారుపేరైన బుల్లెట్ రైళ్లు ఆలస్యం కావడం అరుదే. అందులోనూ రైళ్లలో పాముల బెడద వల్ల ఆలస్యం కావడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా ఎదురైంది. నగోయా నుంచి టోక్యో వెళ్లే బుల్లెట్ రైల్లో మంగళవారం సాయంత్రం ఓ పాము ప్రవేశించడం ప్రయాణికుల్లో కలకలం రేపింది. రైల్లో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ప్యాసింజర్ ఒకరు గమనించి వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాలపాటు నిలిచిపోయింది. ప్రయాణికులను మరో రైల్లోకి తరలించి గమ్యస్థానం చేర్చారు. అయితే రైల్లోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియలేదు. అలాగే ఆ పాము విషపూరితమైనదా కాదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ గాయపడలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం బుల్లెట్ రైళ్లలోకి ప్రయాణికులు చిన్న కుక్కలు, పిల్లులు, పావురాలు లాంటి వాటిని తెచ్చుకోవచ్చు. కానీ పాములను తీసుకెళ్లేందుకు మాత్రం అనుమతి లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం

మహిళలూ జర భద్రం !! ఇవి వాడారంటే.. అంతే సంగతులు !!

బంగారు, వెండి పానీ పూరీ !! గుజరాత్‌ స్పెషల్‌ !!

సౌత్ ఇండియాకు త్వరలో బుల్లెట్‌ రైలు.. సర్వే మొదలవుతుందన్న ప్రధాని మోదీ

హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Follow us
Latest Articles