సౌత్ ఇండియాకు త్వరలో బుల్లెట్ రైలు.. సర్వే మొదలవుతుందన్న ప్రధాని మోదీ
దేశంలో బుల్లెట్ రైళ్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక హామీ ఇచ్చారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, చివరిదశకు వచ్చాయన్నారు. సౌత్, నార్త్ , ఈస్ట్ భారత్ కూ బుల్లెట్ రైలు సేవలు విస్తరిస్తామని చెప్పారు. దక్షిణ భారతానికి బుల్లెట్ రైలుకు సంబంధించిన ఎంక్వైరీ కూడా త్వరలోనే మొదలు కానుందన్నారు. సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అనంతరం ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలో బుల్లెట్ రైళ్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక హామీ ఇచ్చారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, చివరిదశకు వచ్చాయన్నారు. సౌత్, నార్త్ , ఈస్ట్ భారత్ కూ బుల్లెట్ రైలు సేవలు విస్తరిస్తామని చెప్పారు. దక్షిణ భారతానికి బుల్లెట్ రైలుకు సంబంధించిన ఎంక్వైరీ కూడా త్వరలోనే మొదలు కానుందన్నారు. సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అనంతరం ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. ఇక ముంబయి-అహ్మదాబాద్ మధ్య 1.08లక్షల కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం NHSRCLకు 10వేల కోట్లను అందిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలు 5వేల కోట్లు చొప్పున చెల్లించనున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
‘కాంబోడియా అప్సరస’గా భారత దౌత్యవేత్త
షూట్ విషయంలో గొడవ పడిన యూట్యూబర్ జంట !! క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి !!