పోలీస్ అధికారికి హారతి !! దంపతుల వినూత్న నిరసన !!
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి హారతి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఒక జ్యుయలరీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అర్పిత్, ముఖేష్ కలిసి నాలుగు కిలోల వెండిని చోరీ చేసి పారిపోయారు. ఈ చోరీ గురించి ఆ షాపు యజమాని రేవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన నిందితులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి హారతి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఒక జ్యుయలరీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అర్పిత్, ముఖేష్ కలిసి నాలుగు కిలోల వెండిని చోరీ చేసి పారిపోయారు. ఈ చోరీ గురించి ఆ షాపు యజమాని రేవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన నిందితులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై జ్యుయలరీ షాపు దంపతులు అనురాధ, కుల్దీప్ సోని అసంతృప్తి చెందారు. ఈ నెల 6న ఆ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సీఐ జేపీ పటేల్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయనకు హారతి ఇచ్చారు. మెడలో పూల దండ వేసి శాలువా కప్పేందుకు ప్రయత్నించారు. దీనికి ఒప్పుకోని ఆ పోలీస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ దంపతులు తనను అవమానించారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఆ పోలీస్ అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు దృష్టికి కూడా ఇది వెళ్లగా, ఆ దంపతుల ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: