దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

Phani CH

|

Updated on: Apr 18, 2024 | 6:20 PM

భారీ వర్షాలతో ఎడారి దేశం అతలాకుతలమైంది. మంగళవారం దుబాయ్‌ని భారీ కుంభవృష్టి ముంచెత్తింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. దాంతో ఇక్కడికి వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా భారత్‌-దుబాయ్‌ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి.

భారీ వర్షాలతో ఎడారి దేశం అతలాకుతలమైంది. మంగళవారం దుబాయ్‌ని భారీ కుంభవృష్టి ముంచెత్తింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. దాంతో ఇక్కడికి వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా భారత్‌-దుబాయ్‌ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. మన సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లే 15, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్‌ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!

CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు

బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు