Holi 2022: కార్యకర్తలతో జేసీ హొలీ సంబరాలు.. తనయుడితో కలిసి డీజే పాటకు స్టెప్స్ వేస్తూ సందడి
Holi 2022: దేశ వ్యాప్తంగా హొలీ సంబరాలు మొదలయ్యాయి. ఆంధప్రదేశ్ (Andhpradesh) లో కూడా ముందస్తుగానే హోలీని సంబరాల్లో ప్రజలతో పాటు రాజకీయ నేతలు మునిగితేలుతున్నారు. పిల్లలు పెద్దలు కలిసి రంగులు..
Holi 2022: దేశ వ్యాప్తంగా హొలీ సంబరాలు మొదలయ్యాయి. ఆంధప్రదేశ్ (Andhpradesh) లో కూడా ముందస్తుగానే హోలీని సంబరాల్లో ప్రజలతో పాటు రాజకీయ నేతలు మునిగితేలుతున్నారు. పిల్లలు పెద్దలు కలిసి రంగులు(Holi colours) చల్లుకుని హోలీని జరుపుకుంటున్నారు. ఈ హోలీ సంబరాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) తనదైన శైలిలో సందడి చేశారు. యాక్షన్ నుంచి ఎంటర్టైన్మెంట్ చేసే వ్యక్తిగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మారారు. నిత్యం ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ.. కాంట్రావర్సీస్ కి కేరాఫ్ అడ్రస్ గా జేసీ నిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఇక పౌరుషానికి ప్రతీక అంటూ మీసం తిప్పుతూ బుల్లెట్ల లాంటి మాటాలతో తన మన అనే బేధం లేకుండా వ్యాఖ్యలు చేస్తూ.. సంచలనాలను సృష్టిస్తూనే ఉంటారు. అటువంటి జేసీ.. ప్రజలు పార్టీ కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకుంటూ… పాటలకు స్టెప్స్ వేసి సందడి చేశారు.
జేసీ ఈ ఏడాది హోలీకి డిఫరెంట్ గా యాక్షన్ నుంచి ఎంటర్టైన్మెంట్ కు మారారు. హొలీ సంబరాల్లో భాగంగా తాడిపత్రి రోడ్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. టీడీపీ కార్యకర్తలతో కలసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. తనయుడు అస్మిత్ రెడ్డి తో కలిసి జేసీ డీజేలో పాటలకు స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. చిన్న పిల్లాడిలా సందడి చేశారు.
Also Read: Telangana: తెలంగాణలో భానుడు భగభగలు.. ప్రజలకు దడ పుట్టిస్తున్న పగటి ఉష్ణోగ్రతలు