Kunool Jail: ఖిలాడీ ఖైదీ.. ఐదు రోజుల్లో రెండు సార్లు తప్పించుకున్నాడు.. అధికారులు ఏం చేశారంటే

కర్నూలు జైలు(Kurnool Jail) అధికారుల నిర్లక్ష్యం పట్ల జైళ్లశాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఐదు రోజుల వ్యవధిలో ఒకే ఖైదీ(Prisoner).. రెండుసార్లు జైలు నుంచి పారిపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై...

Kunool Jail: ఖిలాడీ ఖైదీ.. ఐదు రోజుల్లో రెండు సార్లు తప్పించుకున్నాడు.. అధికారులు ఏం చేశారంటే
Kurnool Jail
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 17, 2022 | 3:44 PM

కర్నూలు జైలు(Kurnool Jail) అధికారుల నిర్లక్ష్యం పట్ల జైళ్లశాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఐదు రోజుల వ్యవధిలో ఒకే ఖైదీ(Prisoner).. రెండుసార్లు జైలు నుంచి పారిపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి, సంబంధిత నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అప్రమత్తమయ్యారు. జిల్లా జైలును పరిశీలించారు. పారిపోయిన ఖైదీలు ఎక్కడున్నా సరే తక్షణమే పట్టుకోవాలని ఆదేశించారు. నాలుగేళ్ల క్రితం అత్యంత పకడ్బందీగా అధునాతనంగా నిర్మించిన జిల్లా జైలు నుంచి అంత సులభంగా ఎలా తప్పించుకున్నాడనే దానిపై విచారణ(Inquiry) ప్రారంభమైంది. ఈ నెల 12న నాని అనే ఖైదీ జిల్లా జైలు నుంచి తప్పించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ రోజే నానిని పట్టుకున్నారు. పారిపోయిన ఖైదీని లాకప్ లో ఉంచాలి. అతనిపై పటిష్ఠమైన నిఘా పెట్టాలి. కానీ జైలులో ఇవేమీ లేవు. పారిపోయిన ఖైదీకి సులభంగా చెట్లు ఎక్కడం, గోడలు ఎక్కి దిగే అలవాటు ఉందని జైలు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు జైలు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతుండగానే మరో సారి అదే ఖైదీ పారిపోవడం పట్ల జైళ్లశాఖకు తలనొప్పిగా మారింది.

గతంలో జిల్లా జైలు కాంపౌండ్‌ వాల్‌ దూకి అండర్‌ ట్రయిల్‌ ఖైదీ పరారయ్యాడు. ఫిబ్రవరి 16న జరిగిన హత్య కేసులో నాని అనే వ్యక్తి నిందితుడిగా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న నాని శనివారం పారిపోయాడని జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించగానే మరోవైపు పారిపోయిన ఖైదీ తిరిగి ఉదయానికల్లా జైలులో ప్రత్యక్షమయ్యాడు. ఎలా పారిపోయాడు..? ఎందుకు తిరిగి వచ్చాడు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Also Read

Viral: రక్తవర్ణంతో వర్షం.. ఎర్రగా మారిన నీలాకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవాటికెట్లు అందుబాటులోకి..ఎప్పుడంటే

కడప జిల్లా కమలాపురంలో సెంటిమెంట్‌ పాలిటిక్స్‌.. గెలుపు రెండుసార్లేనా? మూడోసారి కష్టమేనా?