Viral: రక్తవర్ణంతో వర్షం.. ఎర్రగా మారిన నీలాకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు
యూరప్‌లో తూర్పు భాగంలో రక్తపుటేరులు పారుతుంటే.. మరోవైపు రక్త వర్షం కురుస్తోంది. ఉన్నట్లుండి ఆకాశం ఎర్రగా మారడం.. అక్కడి వారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇంతకీ ఈ బ్లడ్‌రెయిన్ మిస్టరీ ఏంటి?
Blood rain: యూకే, యూరప్( Europe)లో ఆకాశం ఎర్రగా మారడమే కాదు.. వర్షం కూడా రక్తవర్ణంతో కురిసింది. నీలాకాశం ఎర్రగా మారడం.. అక్కడివారిని ఆశ్చర్యపర్చింది. సాయంత్రం సమయంలో ఆకాశం రక్తాన్ని పులుముకుందా అన్నట్లుగా తయారైంది. ఆతర్వాత కురిసిన వర్షంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కాని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎర్రని ధూళి మేఘాల వల్లే ఆకాశం అలా కనిపించిందంటున్నారు వెదర్ ఎక్స్‌పర్ట్స్. దీనికి సెలియా తుపాన్ తోడవడంతో వాతావరణంలోకి ఎర్రటి ధూళి ప్రవేశించినట్లు చెబుతున్నారు. లండన్‌లో ఈ ఎర్రటి ధూళి భయానకంగా కనిపించింది. అంతేకాదు.. బార్సిలోనా, పారిస్, ఎడిన్‌బర్గ్ ఇలా యూరప్ వ్యాప్తంగా అన్ని నగరాల్లో ఈ అరుణవర్ణం కనబడింది. దీనికి అనేక కారణాలున్నాయి. సహారా ఎడారుల్లోని ఎర్రని దూళి వల్లే ఈ ఎరుపు రంగు కనిపించిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ దూళి మేఘాలు యూరప్ లో విస్తరించి నెమ్మదిగా యూకేను తాకాయి. భూ ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించడం వల్ల ఇలా దర్శనమిచ్చాయి. ఫలితంగా యూరప్‌లోని ఆయాదేశాల్లో రక్తపు వర్ణంలోకి మారింది నీలాకాశం. వర్షం కూడా రక్తవర్ణంలో కనిపించింది.
ఇలాంటి మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ వీదుల్లో పార్క్ చేసిన కార్లపై ఎర్రని దూళి పేరుకుపోయింది. మరోవైపు ఈ వీకెండ్‌లోగా బ్రిటన్లో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా వేసింది అక్కడి వాతావారణ శాఖ. 2021 వేసవిలో బ్రిటన్లో అత్యధిక ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది. బ్రిటన్ దక్షిణ ప్రాంతంలో వానలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. అటు స్పెయిన్ లోని దక్షిణ ప్రాంతాలు సహా, ఫ్రాన్స్ దేశంపై పరుచుకున్న ఈ ఎర్రటి దూళి మేఘాలు… సెలియా తుపాన్ ద్వారా సహరా ఎడారిలోని దూళిని తీసుకొచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో కప్పల, చేపల వర్షాలు కూడా ఇలానే పడ్డాయి. ఇప్పుడు బ్లడ్‌రెయిన్ మిస్టరీ కూడా అలాంటిదే.
Why is their a rusty-red in the rain? pic.twitter.com/cKM1easa3K
— Right Said Fred (@TheFreds) March 16, 2022
Roter Himmel und neue Bücher pic.twitter.com/3ueKt2Dva5
— niko (@replayNIKO) March 15, 2022
Orange rain in Hampshire ? #Sahara #SaharanDust pic.twitter.com/OzSjRS14kF
— Taylaaaa (@tazmania435) March 16, 2022
Also Read: Telangana: ఘాటులోనే కాదు రేటులోనూ తగ్గేదే లే.. బంగారం ధరలో పోటీ పడుతున్న మిర్చి