Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడప జిల్లా కమలాపురంలో సెంటిమెంట్‌ పాలిటిక్స్‌.. గెలుపు రెండుసార్లేనా? మూడోసారి కష్టమేనా?

రాజకీయాల్లో నాయకులు సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటారు. ఎంతలా అంటే.. దాని కోసం ఏదైనా చేసేస్తారు. కడపజిల్లా, కమలాపురం రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేను ఓ భయం వెంటాడుతోందట.

కడప జిల్లా కమలాపురంలో సెంటిమెంట్‌ పాలిటిక్స్‌.. గెలుపు రెండుసార్లేనా? మూడోసారి కష్టమేనా?
Kamalapuram Constituency
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 17, 2022 | 1:48 PM

రాజకీయాల్లో నాయకులు సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటారు. ఎంతలా అంటే.. దాని కోసం ఏదైనా చేసేస్తారు. కడపజిల్లా, కమలాపురం(Kamalapuram) రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేను ఓ భయం వెంటాడుతోందట. దానికోసం కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఏమిటా సెంటిమెంట్‌? ఏమిటా కథ? కడప జిల్లా కమలాపురం పాలిటిక్స్‌లో ఇప్పుడో సెంటిమెంట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ ఎవ్వరైనా వరుసగా రెండు సార్లు మాత్రమే గెలుస్తారంట. మూడోసారి పోటీ చేస్తే.. ఎంతటోళ్లయినా ఓడిపోతారట. ఈ సెంటింట్ దెబ్బకి తోపులనుకున్నవాళ్లు సైతం మూటాముల్లె సర్దుకున్నారట. రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పినవాళ్లు కూడా మూడోసారి చిత్తయిన రికార్డు ఇక్కడ ఉంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1985వరకు.. ఎవ్వరైనా ఒక్కసారే. ఆ తర్వాత ఎమ్మెల్యే మారిపోయేవారట. అయితే, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అవకాశం ఇస్తున్నారట ఇక్కడి ప్రజలు. మూడోసారి పోటీ చేస్తే మాత్రం ఓటమి తప్పడం లేదట. అలా రెండుసార్లు గెలిచినవాళ్లలో.. మైసూరా రెడ్డి , వీరశివారెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఉన్నారు..

ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కూడా వైసిపి నుంచి రెండు దఫాలు గెలిచారు. అయితే, సెంటిమెంట్‌ ప్రకారం..ఈ సారి రవీంద్రనాధ్ రెడ్డికి ఓటమి తప్పదని స్దానికంగా గుసగుసలు మొదలయ్యాయట. సీఎం జగన్‌కు మేనమామే అయినా.. మూడోసారి సెంటిమెంట్‌తో రవీంద్రనాధ్ రెడ్డిలో భయం మొదలైందట. అందుకే, ఈ సారి తన కొడుకు రామాంజుల రెడ్డిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట.

ప్రస్తుతం చింతకొమ్మదిన్నె నుంచి జెడ్పీటీసీ( zptc) గా ఉన్న రామాంజులరెడ్డి రాజకీయ రంగప్రవేశం కూడా సెంటింట్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. రవీంద్ర నాధ్ రెడ్డి మొదటిసారి గెలిచిన చింతకోమ్మదిన్నె నుంచే zptcగా ఉన్నారు ఆయన కుమారుడు. శాసన సభ్యుడిగా కూడా కమలాపురం నుంచి పోటీ చేయిస్తే సెంటిమెంట్ వర్కవుట్‌ అవుతుందనే ఉద్దేశంతో రవీంద్రనాథ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్‌ పరంగా ఇక్కడ మూడో సారి గెలిచే అవకాశం కూడా తక్కువగా ఉండటంతో.. తనకు బదులు కొడుకు రంగంలోకి దింపితే.. ఎమ్మెల్యే పదవి తన కుటుంబం నుంచి చేజారకుండా ఉంటుందని భావిస్తున్నారట.

రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురంలో తన కొడుకును బరిలో దింపి.. తాను కడప నుంచి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. మూడోదఫా గండాన్ని ఇలా గట్టెక్కితే… మంత్రి పదవికూడా దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్నారట రవీంద్రనాధ్ రెడ్డి. ఒకవేళ సీఎం జగన్‌.. రవీంద్ర నాధ్ రెడ్డిని కమలాపురం నుంచే పోటీ చేయాలని ఆదేశిస్తే మాత్రం… సెంటింట్‌ను అధికమించి గెలుస్తారా? అనేదే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్..

Nail Biting Habit: మీకు కూడా గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసా..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?