Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఆర్ఆర్ఆర్ కు అంత ఖర్చు పెట్టారా.. అసలు విషయం బయటపెట్టిన మంత్రి పేర్ని నాని

ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) స్పందించారు. డైరెక్టర్, యాక్టర్ల రెమ్యూనరేషన్ కాకండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు బడ్జెట్‌ (Cinema Budget) దాటితే...

RRR: ఆర్ఆర్ఆర్ కు అంత ఖర్చు పెట్టారా.. అసలు విషయం బయటపెట్టిన మంత్రి పేర్ని నాని
Perni Nani
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 17, 2022 | 2:51 PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) నుంచి టికెట్‌ ధరల పెంపుకు వినతి పత్రం అందిందని మంత్రి పేర్ని నాని అన్నారు. జీఎస్టీ, దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారని తెలిపారు.  ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) స్పందించారు. డైరెక్టర్, యాక్టర్ల రెమ్యూనరేషన్ కాకండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు బడ్జెట్‌ (Cinema Budget) దాటితే విడుదలైన పది రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఉందని జీవో నం 13 లో పొందుపరిచామని అన్నారు. అందులో భాగంగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) నుంచి టికెట్‌ ధరల పెంపుకు వినతి పత్రం అందిందని వెల్లడించారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు చిత్రబృందం ఇచ్చిన వివరాలు పరిశీలిస్తున్నారన్న మంత్రి.. త్వరలోనే ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపిస్తామని వివరించారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ప్రత్యేక టికెట్‌ ధర ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో 20 శాతం షూటింగ్‌ నిబంధన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు వర్తించదని, ఎందుకంటే జీవో రావడానికి ముందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మించారని స్పష్టం చేశారు. అయితే కొత్తగా నిర్మించే చిత్రాలకు ఈ నిబంధనలు తప్పకుండా వర్తిస్తాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి.. ఏపీ గవర్నమెంట్ ఇటీవల జీవో నం13 ను విడుదల చేసింది. దీని ప్రకారం, నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన చిత్రాలకు మొదటి పది రోజుల పాటు ప్రత్యేక టికెట్‌ ధరలు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే మరి కొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వమని కోరుతూ రాజమౌళి, నిర్మాత దానయ్య ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. టికెట్‌ ధరల పెంపునకు సంబంధించి వినతి పత్రం అందించారు. భేటీ అనంతరం.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ భారీ బడ్జెట్​తో రూపొందించిన సినిమా కాబట్టి సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్​ఆర్’​మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ కథానాయికలు. అజయ్​ దేవ్ గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read

sarkaru vaari paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడే..

Viral Video: నాగుపాములతో స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరకు అనూహ్యమైన ట్విస్ట్.. చూస్తే ఫ్యూజులౌట్..

Ghani Trailer Launch Event: గని పంచ్ అంటే మాములుగా ఉండదు మరి.. ట్రైలర్ అదుర్స్.. లైవ్ వీడియో