Telangana: తెలంగాణలో భానుడు భగభగలు.. ప్రజలకు దడ పుట్టిస్తున్న పగటి ఉష్ణోగ్రతలు
Telangana: ఈ ఏడాది మార్చి నెలలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ(Telangana) లో ఉష్ణోగ్రతలు (temperature) రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు..
Telangana: ఈ ఏడాది మార్చి నెలలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ(Telangana) లో ఉష్ణోగ్రతలు (temperature) రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు రోడ్ల మీద జనాలు కనిపించడం తగ్గిపోయింది. ఈసారి ఎండలు గత సంవత్సరం కంటే తొందరగా మొదలయ్యాయి. దీంతో ఇప్పుడే ఈ స్థాయి లో ఎండలు మండిస్తుంటే.. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉండబోతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
మార్చిలోనే భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్లగొండ జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు. దీంతో జిల్లాలో రికార్డ్ స్థాయిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం నుంచే ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో ఉదయం 10 దాటితే చాలు బయటకి రావాలంటే జనం జంకుతున్నారు. దడ పుట్టిస్తున్న పగటి ఉష్ణోగ్రతలతో జనానికి ముచ్చెమటలు పడుతున్నాయి. దీం సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు. గత వారం రోజులుగా రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుంది. దీంతో వాతావరణ శాఖ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతుంది. అవసరం ఉంటె తప్ప బయటకు రావద్దని సూచిస్తుంది.
హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా ఎండలు మండుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చల్లటి గాలులతో వాతావరణం కొంత చల్లగా మారింది. గత రెండు మూడు రోజుల నుంచి రోజు రోజుకు ఎండ వేడిమి పెరిగి పోతుంది. ఈ మధ్య ఉష్ణోగ్రతలు దాదాపు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడి ప్రతాపానికి అత్యదిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండ తీవ్రత ఇంకెత విపరీతంగా ఉంటుందో అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఆదిలాబాద్ కు వస్తున్న రైతులు ఉదయం 11 లోపే పనులు ముగించుకుని ఇంటి దారి పడుతున్నారు. అటు మంచిర్యాల సింగరేణిలో సూర్యప్రతాపానికి ఓపెన్ కాస్ట్ గని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోతుండంతో వైద్య శాఖ ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది.
ఆదిలాబాద్ లో ఉదయం 10 దాటితే చాలు బయటకి వెళ్లాలంటే జంకుతున్న జనం. ఆదిలాబాద్ , మంచిర్యాల , శ్రీరాంపూర్ , మందమర్రి సింగరేణి ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మద్యాహ్నం 12 తర్వాత విపరీతమైన వేడిగాలులతో జనం విలవిలాడుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ల్లో భానుడి ప్రతాపానికి సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు.
Also Read :